స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లను ప్రకటించిన ట్రైయంప్

By Ravi

గడచిన సంవత్సరం జనవరి నెలలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన ప్రముఖ బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ ట్రైయంప్ , తాజాగా ఓ రెండు సరికొత్త స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. బోన్‌విల్లే, స్పీడ్ ట్రిపుల్ మోడళ్లలో ఈ స్పెషల్ ఎడిషన్‌లను అందిస్తామని కంపెనీ తెలిపింది.

స్పెషల్ ఎడిషన్ బోన్‌విల్లే మోటార్‌సైకిల్ ధర 7999 డాలర్లు (సుమారు రూ.4.36 లక్షలు)గా ఉండగా, స్పెషల్ ఎడిషన్ స్పీడ్ ట్రిపుల్ మోటార్‌సైకిల్ ధర 13399 డాలర్లు (సుమారు రూ.7.35 లక్షలు)గా నిర్ణయించామని ట్రైయంప్ పేర్కొంది. భారత్‌లోని కర్ణాటక రాష్ట్రంలో ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఓ అసెంబ్లింగ్ యూనిట్‌ను నెలకొల్పనున్న సంగతి తెలిసినదే. ఈ మేరకు ట్రైయంప్ ఇండియా కర్ణాటక సర్కారుతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా, బెంగుళూరు-చెన్నై హైవేలో ఉన్న నర్సాపూర్ (కోలార్ జిల్లా) వద్ద దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలోట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఓ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఇదే ప్రాంతానికి సమీపంలో హోండా మోటార్‌సైకిల్స్ ఇండియా కూడా ఓ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ట్రైయంప్ ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటులో బోన్‌విల్లే, స్పీడ్ ట్రిపుల్, డేటోనా 675 మోడళ్లను స్థానికంగా అసెంబ్లింగ్ చేయనున్నారు.

Triumph Bonnville
Most Read Articles

English summary
The British Motorcycle manufacture, Triumph Motorcycles has announced two new special edition motorcycles, named Bonnville and Speed Triple. While the Bonnville is priced at $7,999 (INR4.36 lakhs) the Speed Triple is priced at $13,399 (INR 7.35 lakhs).
Story first published: Friday, March 8, 2013, 15:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X