ద్విచక్ర వాహన విభాగంలో 3వ స్థానంపై కన్నేసిన టీవీఎస్

By Ravi

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో మూడవ స్థానంపై కన్నేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరిన్ని కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయటం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని టీవీఎస్ యోచిస్తోంది. ఇటీవలే సరికొత్త స్టార్ సిటీ బైక్‌ని విడుదల చేసిన టీవీఎస్, ఈ ఏడాది మరో మూడు కొత్త మోడళ్లను తీసుకురానుంది.

ఇది కూడా చదవండి: మహీంద్రా రోడియో యూజెడ్ఓ 125 స్కూటర్ విడుదల

రానున్న రోజుల్లో టీవీఎస్ తమ సరికొత్త జెస్ట్ స్కూటర్‌ను విడుదల చేయటంతో పాటుగా ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న అపాచీ మోడళ్లలో రిఫ్రెష్డ్ వెర్షన్లను కూడా ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా, టీవీఎస్ గతంలో నిలిపివేసిన విక్టర్ బ్రాండ్ మోటార్‌సైకిల్‌ను కూడా తిరిగి మార్కెట్లో పునఃప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సవంత్సరం ముగిసే నాటికి విక్టర్ బ్రాండ్ మార్కెట్లోకి రానుంది.

TVS Bike

ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో టాప్ 3 స్థానాలలో వరుసగా హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరియు బజాజ్ ఆటో కంపెనీలు ఉన్నాయి. కొత్త మోడళ్లతో విడుదల తాము కోల్పోయిన మూడవ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, జెస్ట్, విక్టర్, అపాచే మోడళ్లను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వేను శ్రీనివాస్ తమ కంపెనీ వార్షిక సమావేశం సందర్భంగా తెలియజేశారు.

ఇది కూడా చదవండి: హోండా సిబిఎఫ్ స్టన్నర్ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేత

తాము ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టిన జూపిటర్ స్కూటర్, స్టార్ సిటీ మోడళ్లు మంచి విజయాన్ని సాధించడంతో జెస్ట్, విక్టర్ వంటి మోడళ్ల విడుదల షెడ్యూల్‌ను మార్చాల్సి వచ్చిందని, ఏదేమైనప్పటికీ ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్కసారి చొప్పున కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

Most Read Articles

English summary
Chennai-based TVS Motor Company is targeting regaining the third position in the country's two-wheeler market on the back of new launches in the current fiscal.
Story first published: Monday, August 18, 2014, 9:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X