నేపాల్ మార్కెట్లో టీవీఎస్ ఫినిక్స్ బైక్ విడుదల

By Ravi

చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న లేటెస్ట్ 125సీసీ మోటార్‌సైకిల్ ఫినిక్స్ (TVS Phoenix) ఇప్పుడు నేపాల్ మార్కెట్లో కూడా లభ్యం కానుంది. భారత్‌లో మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఈ టీవీఎస్ ఫినిక్స్ బైక్ నేపాల్‌లో సిజి మోటో కార్ప్ (టీవీఎస్ అధీకృత పంపిణీదారు) ద్వారా విక్రయించనున్నారు.

నేపాల్ మార్కెట్లో టీవీఎస్ ఫినిక్స్ బైక్ ధర 1,69,900 నేపాలీ రూపాయిలుగా ఉంది (మనదేశ కరెన్సీలో ఇది సుమారు రూ.1.08 లక్షలతో సమానం). భారత కరెన్సీ విలువతో పోల్చుకుంటే నేపాల్ కరెన్సీ విలువ తక్కువగా ఉండటంతో పాటు, దిగుమతి సుంకాల వలన ఈ బైక్ అక్కడి మార్కెట్లో అంత అధిక ధర పలుకుతోంది.

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహేష్ బ్రాండ్ అంబాసిడర్

మహేష్ బ్రాండ్ అంబాసిడర్

టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాధించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుటు టీవీఎస్ మోటార్‌సైకిళ్లకు ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు.

ఓవర్‌వ్యూ:

ఓవర్‌వ్యూ:

టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న ఫ్లేమ్ మోటార్‌సైకిల్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ ఓ విడుదల చేసిన ప్రీమియం 125సీసీ మోటార్‌సైకిల్ టీవీఎస్ ఫినిక్స్. శక్తివంతమైన పెర్ఫామెన్స్, మెరుగైన మైలేజ్, ఆకట్టుకునే డిజైన్ వంటి ఫీచర్లతో కంపెనీ ఈ ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది.

డ్యూయెల్ టోన్ గ్రాఫిక్స్:

డ్యూయెల్ టోన్ గ్రాఫిక్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125 మోటార్‌సైకిల్ డ్యూయెల్ టోన్ (రెండు రంగల కలయిక) కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్‌ను కలిగి ఉండి చూపరలను ఇట్టే ఆకట్టుకుంటుంది. మొరాకన్ రెండ్, అలస్కా గ్రీన్, హెల్సిన్కీ బ్లాక్ సిల్వర్, బెల్జియన్ బ్లాక్ రెడ్, ఆక్స్‌ఫర్డ్ గ్రే రంగుల్లో ఇది లభిస్తుంది.

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్:

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్:

హెడ్‌లైట్‍‌కు పైభాగంలో రెండు చివర్లలో అమర్చిన ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్ బైక్‌కు మంచి స్టయిలిష్‌ లుక్‌నిస్తాయి. బైక్‌కు కళ్ల మాదిరిగా ఉండే ఈ లైట్లను పగలైనా రాత్రైనా ఆన్ చేసుకోవచ్చు.

ఈకోథ్రస్ట్ ఇంజన్‌:

ఈకోథ్రస్ట్ ఇంజన్‌:

టీవీఎస్ ఫినిక్స్‌లో అమర్చిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

హాజర్డ్ లైట్స్:

హాజర్డ్ లైట్స్:

కేవలం కార్లకు మాత్రమే పరిమితమైన హాజర్డ్ లైట్స్ ఇప్పుడు టీవీఎస్ ఫినిక్స్‌లో కూడా లభించనున్నాయి. బైక్‌ను రోడ్డుపై నిలిపినప్పుడు ఎదురుగా, వెనుకగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు ఈ హాజర్డ్ లైట్స్ ఉపయోగపడుతాయి. హాజర్డ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు బైట్ ఫ్రంట్, రియర్ ఇండికేటర్స్ వెలుగుతూ, ఆరుతూ ఉంటాయి.

డిజిటల్ మీటర్:

డిజిటల్ మీటర్:

ఈ సెగ్మెంట్లో కెల్లా పూర్తిగా డిజిటల్ మీటర్‌తో లభించే మోటార్‌సైకిల్ టీవీఎస్ ఫినిక్స్ మాత్రమే.

రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్:

రోటో పెటల్ డిస్క్ బ్రేక్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ డిస్క్ బ్రేక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. డిస్క్ వద్దకునే వారు డ్రమ్ బ్రేక్ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సమర్థవంతమైన బ్రేకింగ్ అనుభూతిని కల్పిస్తుంది.

వేరియంట్స్:

వేరియంట్స్:

టీవీఎస్ ఫినిక్స్ 125సీసీ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో ఒకటి డ్రమ్ బ్రేక్ వెర్షన్ కాగా మరొకటి డిస్క్ బ్రేక్ వెర్షన్.

Most Read Articles

English summary
Chennai based two-wheeler manufacturer TVS Motor Company has launched its latest 125cc motorcycle TVS Phoenix in Nepal market at 1.69 lakh Nepalese rupees. The commuter will be sold through CG Moto Corp, TVS’ official distributor in Nepal.
Story first published: Friday, August 30, 2013, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X