టీవీఎస్ స్కూటీ జెస్ట్ విడుదల; ధర రూ.42,300

By Ravi

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'టీవీఎస్' గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన తమ లేటెస్ట్ 110సీసీ స్కూటర్ 'టీవీఎస్ స్కూటీ జెస్ట్'ను నేడు (ఆగస్ట్ 20, 2014) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ సరికొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ ధర రూ.42,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

స్కూటీ డిఎన్ఏ మిస్ కాకుండా, బెటర్ పవర్, పెర్ఫార్మెన్స్, రైడ్ క్వాలిటీ మరియు హ్యాండ్లింగ్ విషయాల్లో మెరుగ్గా ఉండేలా ఈ కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్‌ను తయారు చేశారు. మోడ్రన్ స్టయిలింగ్, అట్రాక్టివ్ కలర్స్, స్టయిలిష్ గ్రాఫిక్స్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దారు. ఇందులో రీఫైన్డ్ నెక్స్ట్ జనరేషన్ 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

తర్వాతి స్లైడ్‌లలో కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ విశిష్టతలను తెలుసుకోండి.

ఇంజన్

ఇంజన్

కొత్త టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో రీఫైన్డ్ 109.7సీసీ సివిటిఐ సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదే ఇంజన్‌ను జూపిటర్, వెగో స్కూటర్లలో కూడా ఉపయోగిస్తున్నారు.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

ఈ ఇంజన్ గరిష్టంగా 8 పిఎస్‌ల శక్తిని, 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 11.1 సెకండ్ల వ్యవధిలో 0-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభిస్తుంది. అవి - టార్కోయిస్ బ్లూ, వొల్కానో రెడ్, బ్లాక్, పెరల్ వైట్.

ఫీచర్స్

ఫీచర్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్‌లో లభించే ఫీచర్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

షార్ప్ అండ్ బోల్డ్ కర్వ్స్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

ట్విలైట్ ల్యాంప్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

సింపుల్ అండ్ క్లీన్ బ్యాక్ లిట్ స్పీడోమీటర్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

లీఫ్ షేప్డ్ బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

ఎల్ఈడి టెయిల్ ల్యాంప్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

విశాలమైన టెక్స్చర్డ్ ఫ్లోర్ బోర్డ్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

డబుల్ స్టిచ్డ్ సీట్స్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

స్టెయిన్‌లెస్ స్టీల్ సైలెన్సర్ కవర్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

రైట్ టర్నింగ్ రేడియస్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డబుల్ రేటెడ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

ఓపెన్ గ్లవ్ బాక్స్ విత్ వాటర్ బాటిలో హోల్డర్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

ఫోల్డబల్ బ్యాగ్ హుక్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

యాంటీ స్కిడ్ ట్యూబ్‌లెస్ టైర్స్, పార్కింగ్ బ్రేక్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ ఫీచర్లు

ఈజీ సెంటర్ స్టాండ్, ఈకోమీటర్, లాంగ్ ఐడిలింగ్ ఇండికేటర్, వెడల్పాటి సీట్, ట్యూబ్‌లెస్ టైర్స్, బ్రైట్ హెడ్‌ల్యాంప్ వంటి ఇతర ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

Most Read Articles

English summary
Adding a new and snazzier dimension to its iconic Scooty brand, TVS Motor Company today launched its much awaited TVS Scooty Zest 110. The all new TVS Scooty Zest 110 offers customers an optimum balance of power, performance, ride quality and handling along with a host of other attractive features, while staying true to its Scooty DNA.
Story first published: Wednesday, August 20, 2014, 17:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X