మరికొద్ది రోజుల్లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ విడుదల!

By Ravi

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' (TVS Star City+) బైక్ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల కానుంది.

ఈ కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌ను ఇప్పటికే తమిళనాడులో హోసూర్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఇది మే 2014 నెల మొదటి వారంలో విడుదల కానుంది. ప్రారంభంలో భాగంగా, ఈ బైక్‌ను నార్త్ ఇండియాలో (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో) విడుదల కానుంది. ఆ తర్వాత జులై నాటికి ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‍‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

ప్రస్తుత టీవీఎస్ స్టార్ సిటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను నిర్మిస్తున్నారు. ఇదివరకటి స్టార్ సిటీ కన్నా మరింత మెరుగైన డిజైన్, ప్రీమియం ఫీల్‌నిచ్చేలా ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

రెగ్యులర్ స్టార్ సిటీ కన్నా స్టార్ సిటీ ప్లస్ డిజైన్ మరింత షార్ప్‌గా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగిన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్, మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

కొత్త ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, క్నీ (మోకాలు) రెస్ట్స్‌తో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్, విశాలమైన సీట్, కొత్త ఎగ్జాస్ట్ పైప్ డిజైన్, డ్యూయెల్ టోన్ మడ్‌గార్డ్ వంటి ఫీచర్లను ఇందులో జోడించారు.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

టీవీఎస్ స్టార్ సిట్ ప్లస్‌లో కాస్మోటిక్ మార్పులతో పాటుగా యాంత్రికపరమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇందులో వెనుక వైపు కొత్తగా 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను జోడించారు. రెగ్యులర్ స్టార్ సిటీలో 2-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను మాత్రమే అందిస్తున్నారు.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

ఇక ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 110సీసీ ఈకోథ్రస్ట్ డిఎల్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు (రెగ్యులర్ స్టార్ సిటీలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు).

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.3 హార్స్‌పవర్‌ల శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరింత మెరుగైన మైలేజీనిచ్చేలా ఈ ఇంజన్‌ను రీఫైన్ చేశారు.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్

ఎలక్ట్రిక్ స్టార్ట్, సర్వీస్ రిమైండర్, డిజిటల్ స్పీడో మీటర్ విత్ ఈకోమీటర్ వంటి ఫీచర్లను ఈ కొత్త స్టార్ సిటీ ప్లస్ బైక్‌లో ఆఫర్ చేస్తున్నారు.

Most Read Articles

English summary
TVS Star City+ is a more premium version of the regular Star City and was first showcased at the Auto Expo 2014 in February. The first production units have now reportedly rolled out of the manufacturing plant in Hosur, Tamil Nadu.
Story first published: Thursday, April 24, 2014, 17:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X