హైదరాబాద్‌లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ విడుదల

By Ravi

హైదరాబాద్: చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఈనెల ఆరంభంలో దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' (TVS Star City+) 110సీసీ మోటార్‌సైకిల్‌ను కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లో కూడా ప్రవేశపెట్టింది.

రాష్ట్ర విపణిలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ధరలు ఇలా ఉన్నాయి:
కిక్ స్టార్ట్ వెర్షన్ - రూ.42,434
ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్ - రూ.44,900
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


ప్రస్తుత టీవీఎస్ స్టార్ సిటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కొత్త టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను నిర్మిస్తున్నారు. ఇదివరకటి స్టార్ సిటీ కన్నా మరింత మెరుగైన డిజైన్‌తో ప్రీమియం ఫీల్‌నిచ్చేలా ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. రెగ్యులర్ స్టార్ సిటీ కన్నా స్టార్ సిటీ ప్లస్ డిజైన్ మరింత షార్ప్‌గా ఉంటుంది. కొత్త ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, క్నీ (మోకాలు) రెస్ట్స్‌తో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్, విశాలమైన సీట్, కొత్త ఎగ్జాస్ట్ పైప్ డిజైన్, డ్యూయెల్ టోన్ మడ్‌గార్డ్ వంటి ఫీచర్లను ఇందులో జోడించారు.

టీవీఎస్ స్టార్ సిట్ ప్లస్‌లో కాస్మోటిక్ మార్పులతో పాటుగా యాంత్రికపరమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇందులో వెనుక వైపు కొత్తగా 5-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను జోడించారు. రెగ్యులర్ స్టార్ సిటీలో 2-స్టెప్ అడ్జస్టబల్ సస్పెన్షన్‌ను మాత్రమే అందిస్తున్నారు. ఇందులో 110సీసీ ఈకోథ్రస్ట్ డిఎల్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు (రెగ్యులర్ స్టార్ సిటీలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు).

TVS Star City Plus Launched In Hyderabad

ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.3 హార్స్‌పవర్‌ల శక్తిని మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరింత మెరుగైన మైలేజీనిచ్చేలా ఈ ఇంజన్‌ను రీఫైన్ చేశారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 85 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, సర్వీస్ రిమైండర్, డిజిటల్ స్పీడో మీటర్ విత్ ఈకోమీటర్ వంటి ఫీచర్లను ఈ కొత్త స్టార్ సిటీ ప్లస్ బైక్‌లో ఆఫర్ చేస్తున్నారు.
Most Read Articles

English summary
TVS Star City+, the company's new commuter motorcycle that was previewed at the Auto Expo in February, has been launched at an event in Hyderabad. The new Star City+ will be placed above the regular Star City and sports several features updates over it, both visual and mechanical.
Story first published: Wednesday, May 28, 2014, 10:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X