టీవీఎస్ నుంచి స్కూటీ జెస్ట్, విక్టర్ ఫేస్‌లిఫ్ట్, అపాచే ఫేస్‌లిఫ్ట్

By Ravi

ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ 'టీవీఎస్' త్వరలో భారత మార్కెట్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. ఇటీవలే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన ఈ కంపెనీ, రానున్న జూన్-జులై నాటికి స్కూటీ జెస్ట్ స్కూటర్‌ను కూడా విడుదల చేయనుంది.

అంతేకాకుండా, గతంలో అత్యంత పాపులర్ అయిన టీవీఎస్ విక్టర్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను కూడా పునఃప్రవేశపెట్టేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2014 నెలలో కంపెనీ సరికొత్త టీవీఎస్ విక్టర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది.

ఈ రెండు మోడళ్లతో పాటుగా టీవీఎస్ ప్రస్తుతం విక్రయిస్తున్న అపాచే‌లో ఓ అప్‌గ్రేడెడ్/ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయనుంది. అలాగే, బిఎమ్‌డబ్ల్యూ కోసం టీవీఎస్ తయారు చేస్తున్న ఓ లో-ఎండ్ లగ్జరీ బైక్‌ను వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తోంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

టీవీఎస్ స్కూటీ జెస్ట్

టీవీఎస్ స్కూటీ జెస్ట్

గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ తమ 110సీసీ మోడల్‌ స్కూటర్ 'టీవీఎస్ స్కూటీ జెస్ట్'ను ఆవిష్కరించింది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న స్కూటీ పెప్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షనే ఈ కొత్త స్కూటీ జెస్ట్. స్టయిలిష్ బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడి ఇండికేటర్ ల్యాంప్స్, కొత్త రియర్ స్టాఫ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రాబ్ హ్యాండిల్ బార్స్ వంటి డిజైన్ మార్పులను ఇందులో గమనించవచ్చు. స్కూటీ పెప్‌తో పోల్చుకుంటే, జెస్ట్‌లో ఈ కాస్మోటిక్ మార్పులతో పాటుగా మరింత విశాలమైన సీట్, పెద్ద ఫుట్ బోర్డ్, 19 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, హెవీ బాడీ వంటి మార్పులు కూడా ఉన్నాయి.

టీవీఎస్ స్కూటీ జెస్ట్

టీవీఎస్ స్కూటీ జెస్ట్

టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్‌లో 109.7సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు (వెగో స్కూటర్లో ఉపయోగించిన ఇంజన్). ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. వాస్తవానికి, టీవీఎస్ వెగో ఛాస్సిస్, వీల్‌బేస్, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌లనే జెస్ట్ స్కూటర్‌లో కూడా ఉపయోగించారు. ఇది లీటరు పెట్రోల్‌కు గరిష్టంగా 62 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. అండర్ సీట్ లైట్, మొబైల్ ఫోన్ చార్జింగ్ పాయింట్ వంటి పలు విశిష్టమైన ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

టీవీఎస్ విక్టర్ రీలాంచ్

టీవీఎస్ విక్టర్ రీలాంచ్

టీవీఎస్‌ నుంచి గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాపులర్ బైక్ 'టీవీఎస్ విక్టర్'ను తిరిగి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా గ్రామీణ, పట్టణ మార్కెట్లలోని కస్టమర్లును టార్గెట్ చేసుకొని అధునాతన ఇంజన్, ఆకట్టుకునే డిజైన్, మెరుగైన మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

టీవీఎస్ అపాచే ఫేస్‌లిఫ్ట్

టీవీఎస్ అపాచే ఫేస్‌లిఫ్ట్

టీవీఎస్ అందిస్తున్న అపాచే బ్రాండ్‌లో కంపెనీ మరో కొత్త పవర్‌ఫుల్ (200-250సీసీ) వేరియంట్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు సమచారం. 2015లో అపాచే 200సీసీ బైక్‌ను దాని తర్వాత అపాచే 250సీసీ బైక్‌ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం అపాచే బ్రాండ్‌లో 160సీసీ మరియు 180సీసీ మోడళ్లు అందుబాటులో ఉ్ననాయి. గతంలో టీవీఎస్ ఆర్ అండ్ డి హెడ్ వినయ్ హెర్నే ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ.. 2015లో కొత్త రేంజ్ అపాచే‌లను విడుదల చేస్తామని వెల్లడించారు.

టీవీఎస్-బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ బైక్

టీవీఎస్-బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ బైక్

ఇకపోతే.. టీవీఎస్ మోటార్ కంపెనీ, బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, బిఎమ్‌డబ్ల్యూ కోసం తొలి ద్విచక్ర వాహనాన్ని 2015 ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ ఇటీవలే తెలిపారు. గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఓ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసినదే. ఈ ఒప్పందం ప్రకారం, టీవీఎస్ రూ.150 కోట్ల పెట్టుబడిని వెచ్చిస్తుండగా, మోటార్‌సైకిళ్ల అభివృద్ధి, టెస్టింగ్ ఖర్చులను బిఎమ్‌డబ్ల్యూ భరించనుంది.

Most Read Articles

English summary
TVS launched the Star City+ commuter motorcycle yesterday in Chennai. Speaking during the event, company Chairman and Managing Director, Venu Srinivasan revealed their plans for the near future, which includes some exciting and interesting new launches.
Story first published: Wednesday, May 7, 2014, 12:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X