లోహియా ఆటో ద్వారా భారత్‌కు వస్తున్న యూఎమ్ మోటార్‌సైకిల్

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ యూఎమ్ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గడచిన ఫిబ్రవరి నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. యూఎమ్ గ్లోబల్‌కు చెందిన భారతీయ అనుబంద సంస్థ 'యూఎమ్ మోటార్‌సైకిల్స్' (UM Motorcycles) భారత్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ లోహియా ఆటో ద్వారా ఇక్కడి మార్కెట్లో కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

లోహియా ఆటోకు ఉత్తరాఖాండ్‌లో ఓ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో సాలీనా 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా యూఎమ్ మోటార్‌సైకిల్స్ భారత కస్టమర్ల కోసం కొత్త రేంజ్ ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో యూఎమ్ మోటార్‌సైకిల్స్ తాము గ్లోబల్ మార్కెట్లలో ఆఫర్ చేస్తున్న కొన్ని ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది.

యూఎమ్ మోటార్‌సైకిల్స్ సంస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను, భారత్‌లో కంపెనీ ఆఫర్ చేయనున్న వివిధ ఉత్పత్తుల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

లోహియా ఆటో ద్వారా భారత్‌కు: యూఎమ్ మోటార్‌సైకిల్

తర్వాతి స్లైడ్‍‌లలో యూఎమ్ మోటార్‍‌సైకిల్స్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

లోహియా ఆటో ద్వారా భారత్‌కు: యూఎమ్ మోటార్‌సైకిల్

అమెరికాకు చెందిన ఈ యూఎమ్ (యునైటెడ్ మోటార్స్) మోటార్‌సైకిల్ కంపెనీ ఢిల్లీలో తమ కార్పోరేట్ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రారంభంలో భాగంగా, ఈ కంపెనీ భారత్‌లో నాలుగు మోడళ్లను ఆఫర్ చేయనుంది. వీటి ఇంజన్ సామర్థ్యాలు 125సీసీ నుంచి 250సీసీ రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

లోహియా ఆటో ద్వారా భారత్‌కు: యూఎమ్ మోటార్‌సైకిల్

తమ ఉత్పత్తులను సరసమైన ధరకే అందించేందుకు వీలుగా, వాటిని స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు గాను కంపెనీ భారత్‌లోనే ఓ తయారీ/అసెంబ్లింగ్ ప్లాంట్‌ను మరియు ఓ ఆర్ అండ్ డి కేంద్రాన్ని కూడా భారత్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

లోహియా ఆటో ద్వారా భారత్‌కు: యూఎమ్ మోటార్‌సైకిల్

భారత్‌లో సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ కోసం యూఎమ్ గ్లోబల్ తమ స్థానిక భాగస్వామిగా లోహియా ఆటోను ఎంచుకున్నట్లు సమాచారం. ఈ కొత్త భారతీయ భాగస్వామితో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

రెనెగేడ్ స్పోర్ట్

రెనెగేడ్ స్పోర్ట్

యూఎమ్ గ్లోబల్ తమ రెనెగేడ్ బ్రాండెడ్ మోటార్‌సైకిళ్లను ఇక్కడి మార్కెట్లో పరిచయం చేయనుంది. ఇందులో రెనెగేడ్ స్పోర్ట్ కూడా ఒకటి. ఇది 137.8సీసీ, 180.4సీసీ, 196.4సీసీ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

* 137.8 cc - (10.97 HP at 7900 rpm/10.53 Nm at 5600 rpm)

* 180.4 cc - (16.7 HP at 8600 rpm/13.68 Nm at 8000 rpm)

* 196.4 cc - (15.22 HP at 7500 rpm/14.67 Nm at 6400 rpm)

రెనెగేడ్ డ్యూటీ

రెనెగేడ్ డ్యూటీ

లీజర్ మోటార్‌సైకిల్ స్టయిల్‌లో ఉండే ఈ రెనెగేడ్ డ్యూటీ కూడా మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి :-

* 124 cc (10.79 HP at 8300 rpm/9.15 Nm at 6500 rpm)

* 124 cc (11.85 HP at 7773 rpm/9.81 Nm at 6657 rpm)

* 149 cc - (12.92 HP at 7630 rpm/11.32 Nm at 6360 rpm)

రెనెగేడ్ లిమిటెడ్

రెనెగేడ్ లిమిటెడ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ స్టయిల్‌లో కనిపించే ఈ క్రూజర్ మోటార్‌సైకిల్ 'రెనెగేడ్ లిమిటెడ్' రెండు ఇంజన్ ఆప్షన్లలో (175సీసీ, 196సీసీ) లభ్యం కానుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

రెనెగేడ్ కమాండో

రెనెగేడ్ కమాండో

రెండవ ప్రపంచ యుద్ధం ఆర్మీ మోటార్‌సైకిల్ థీమ్‌లో ఉండే ఈ రెనెగేడ్ కమాండో ఇది వరకు చెప్పుకున్న మూడు మోటార్‌సైకిళ్ల కన్నా శక్తివంతమైనది. ఇందులో 223సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 18 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 15.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధరలు

ధరలు

భారత మార్కెట్లో యూఎమ్ మోటార్‌సైకిల్స్ అందించనున్న ఉత్పత్తుల ధరలు రూ.75,000 నుంచి రూ.1.50 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
UM Motorcycles is an automotive brand of America, it was founded in 1992 by Octavio Villegas Llano. It is relatively a modern automobile manufacturer and is learning with every step taken. They had recently announced it would be entering the Indian market with its product portfolio.
Story first published: Wednesday, October 1, 2014, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X