భారత్‌లో విడుదల కానున్న సరికొత్త బైక్‌లు, స్కూటర్లు

By Ravi

భారత్‌లో మోటార్‌సైకిల్, స్కూటర్ ప్రియులను అలరించేందుకు, ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త ఉత్పత్తులో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో అనేక కొత్త మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు దేశీయ విపణిలో విడుదల కానున్నాయి.

ఇంధన ధరలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, మోటారిస్టులు తమ ఆలోచనను మార్చుకొని, తక్కువ మైలేజీనిచ్చే కార్లకు బదులుగా ఎక్కువ మైలేజీనిచ్చే ద్విచక్ర వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ద్విచక్ర వాహన విభాగం గణనీయంగా వృద్ధి చెందుతోంది.

ఓ వైపు కార్ల మార్కెట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే, ద్విచక్ర వాహన మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఈ వృద్ధికి తగినట్లుగానే, ఆటోమొబైల్ తయారీదారులు కూడా విస్తృత స్థాయిలో ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. మరి సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!
ఇది కూడా చదవండి: Upcoming Cars: 'భారత్‌లో విడుదల కానున్న కొత్త కార్లు'

భారత్‌కు వచ్చే బైక్స్, స్కూటర్స్

సమీప భవిష్యత్తులో భారత విపణిలో విడుదల కానున్న కొత్త మోటార్‌‌సైకిళ్లు, స్కూటర్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

* అంచనా విడుదల తేది: అక్టోబర్ 2013

* అంచనా ధర: రూ.2.5-3 లక్షల రేంజ్‌లో

ఇప్పటికే యూరప్ కస్టమర్లకు చేరువైన ఈ మేడ్ ఇన్ ఇండియా రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మోటార్‌సైకిల్, వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఈ క్లాసిక్ కెఫే రేసర్ స్టైల్ మోటార్‌సైకిల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న 500సీసీ మోటార్‌సైకిళ్లలో కెల్లా అత్యంత తేలికైనది. క్లాసీ డిజైన్, స్టయిలిష్ లుక్, హై-పెర్ఫామెన్స్ ఇంజన్, మోడ్రన్ ఫీచర్లతో ఇది లభ్యం కానుంది.

టీవీఎస్ జెస్ట్

టీవీఎస్ జెస్ట్

* అంచనా విడుదల తేది: జనవరి 2014

* అంచనా ధర: రూ.40,000 నుంచి రూ.45,000

ఇటీవలే అబ్బాయిల కోసం జూపిటర్ స్కూటర్‌ను ప్రవేశపెట్టిన టీవీఎస్, ప్రత్యేకించి అమ్మాయిల కోసం స్కూటీ సిరీస్‌లో జెస్ట్ అనే కొత్త స్కూటర్‌ను తీసుకురానుంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 375

బజాజ్ పల్సర్ 375

* అంచనా విడుదల తేది: జనవరి 2014

* అంచనా ధర: రూ.2 లక్షల రేంజ్‌లో

పల్సర్ 200 ఎన్ఎస్‌తో సంతృప్తి చెందని స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం బజాజ్ ఆటో ఓ హై-పెర్ఫామెన్స్ పల్సర్ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి పల్సర్ 375 అనే పేరును పెట్టొచ్చని తెలుస్తోంది. కెటిఎమ్ డ్యూక్ 390 నేక్డ్ బైక్ కాగా, పల్సర్ 375 ఫుల్ ఫెయిర్డ్ (బాడీ ప్యానెల్స్‌తో కూడిన) బైక్‌గా ఉంటుంది. దీని ధర డ్యూక్ 390 కన్నా తక్కువగా ఉంటుందని అంచనా.

2014 హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్

2014 హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్

* అంచనా విడుదల తేది: 2014 ఆరంభంలో

* అంచనా ధర: రూ.1.5 లక్షల రేంజ్‌లో

ప్రస్తుతం హీరో మోటోకార్ప్ అందిస్తున్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడల్‌కు సక్సెసర్‌గా ఇందులో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్ మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఇటీవలే ఈ కొత్త 2014 హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడల్‌ను మకావ్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్‌లో 250సీసీ ఇంజన్‌ను ఉఫయోగించవచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని పల్సర్ 200ఎన్ఎస్, కెటిఎమ్ డ్యూక్ 200, హోండా సిబిఆర్ 250ఆర్ వంటి మోడళ్లతో తలపడనుంది.

మహీంద్రా మోజో

మహీంద్రా మోజో

* అంచనా విడుదల తేది: 2014 ఆరంభంలో

* అంచనా ధర: రూ.2 లక్షల రేంజ్‌లో

ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మహీంద్రా మోజో బైక్ విడుదల వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా జరగవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఈ 300సీసీ బైక్‌ను రీడిజైన్ చేస్తున్నట్లు కూడా వార్తలున్నాయి. బహుశా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా మోజో బైక్‌ను కంపెనీ ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.

హ్యోసంగ్ జివి250

హ్యోసంగ్ జివి250

* అంచనా విడుదల తేది: 2014 మధ్య భాగంలో

* అంచనా ధర: రూ.2.5-3 లక్షల రేంజ్‌లో

దక్షిణ కొరియాకు చెందిన హ్యోసంగ్, తమ చిన్న క్రూయిజర్ బైక్ జివి250 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో 250సీసీ సెగ్మెంట్లో స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి కానీ క్రూయిజర్ స్టైల్ బైక్స్ లేవు. ఈ నేపథ్యంలో, హ్యోసంగ్ జివి250 ఈ సెగ్మెంట్లో హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ 500సీసీ బైక్

హ్యార్లీ డేవిడ్‌సన్ 500సీసీ బైక్

* అంచనా విడుదల తేది: 2014లో

* అంచనా ధర: రూ.4.5-5 లక్షల రేంజ్‌లో

ఇప్పటి వరకు హై-పెర్ఫామెన్స్ బైక్‌లను తయారు చేస్తూ వచ్చిన అమెరికన్ ద్విచక్ర వాహన దిగ్గజం హ్యార్లీ డేవిడ్‌సన్ ఇప్పుడు, భారత్ వంటి మార్కెట్లో కోసం 500సీసీ రేంజ్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిల్‌ను తయారు చేయనుంది. 800సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఇంపోర్టెడ్ బైక్‌లపై అధిక కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్న నేపథ్యంలో, సరమైన ధరకే ఓ బైక్‌ను అందించేందుకు కంపెనీ 500సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగి ఓ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఇది విడుదల కావచ్చని అంచనా.

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250ఎస్

సుజుకి ఇనాజుమా జిడబ్ల్యూ250ఎస్

* అంచనా విడుదల తేది: ఫిబ్రవరి 2014లో

* అంచనా ధర: రూ.2-2.5 లక్షల రేంజ్‌లో

వాస్తవానికి గడచిన జున్ నెలలోనే ఈ 250సీసీ సుజుకి బైక్ భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

Most Read Articles

English summary
The near future holds some exciting news for motorcycle enthusiasts in India. The rapidly maturing two wheeler scene in India will witness the launch of several bike and scooter models in all categories, ranging from small displacement scooterettes to large displacement super bikes to cruisers to quarter liter motorcycles.
Story first published: Saturday, September 28, 2013, 22:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X