వెస్పా జిటిఎస్‌లో ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టీమీడియా సిస్టమ్

By Ravi

ఇటాలియన్ టూవీలర్ కంపెనీ పియాజ్జియో, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న అత్యంత శక్తివంతమైన స్కూటర్ 'వెస్పా జిటిఎస్' (Vespa GTS). ఈ ఇప్పుడు పవర్‌ఫుల్ స్కూటర్‌లో కంపెనీ మరిన్ని టెక్నికల్ అప్‌గ్రేడ్స్ చేసింది.

ఈ టెక్నికల్ అప్‌గ్రేడ్స్‌లో ప్రధానంగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్, కొత్త ఎన్‌హ్యాన్స్డ్ స్లైడింగ్ సస్పెన్షన్ (ఈఎస్ఎస్) మరియు వెస్పా మల్టీమీడియా ప్లాట్‌ఫామ్‌లను ఇందులో జోడించారు.

వెస్పా జిటిఎస్ స్కూటర్ ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాల్లో అమ్ముడుపోతోంది మరియు ఇది మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను, ఫీచర్లను ఆఫర్ చేస్తూ వెస్పా 946 స్కూటర్ కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ స్కూటర్ గురించి మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

వెస్పా జిటిఎస్ స్కూటర్‌కు సంబంధించి తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని ఆసక్తికర విషయాలను చూడండి.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

వెస్పా జిటిఎస్‌లో ఉపయోగించిన ఏబిఎస్ సిస్టమ్ ముందు, వెనుక చక్రాలు ఎంత వేగంతో తిరుగుతున్నాయనేదాన్ని సెన్సార్ల ద్వారా గ్రహించి దానికి అనుగుణంగా పనిచేస్తాయి. ఈ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వలన బ్రేక్ వేసినప్పుడు స్కూటర్ జారిపోకుండా ఉంటుంది.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

ఇందులోని ఎన్‌హ్యాన్స్డ్ స్లైడింగ్ సస్పెన్షన్ (ఈఎస్ఎస్) సిస్టమ్ ట్రెడిషనల్ వెస్పా సింగిల్ సైడెడ్ ఫ్రంట్ సస్పెన్షన్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త సిస్టమ్ వలన రైడ్ కంఫర్ట్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

ఇందులోని వెస్పా మల్టీమీడియా ప్లాట్‌ఫామ్ సాయంతో మీ స్మార్ట్ ఫోన్‌ను స్కూటర్‌లోని ఆన్-బోర్డ్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఉపయోగకరమైన, రియల్-టైమ్ సమాచారాన్ని అందిస్తుంది.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

ఈ సిస్టమ్ స్పీడ్, ఆర్‌పిఎమ్, ఫ్యూయెల్ ఎకానమీతో పాటుగా పవర్, టార్క్, ఎయిర్ ప్రెజర్, టైర్ వేర్ డేటా మొదలైన సమాచారాన్ని కూడా చూపిస్తుంది. ఇంకా ఇది మీ స్మార్ట్‌ఫోన్‌ను జిపిఎస్‌లా ఉపయోగించుకునేందుకు కూడా సహకరిస్తుంది. ముందు వైపు ఉండే యూఎస్‌బి పోర్ట్ సాయంతో ఫోన్‌ను చార్జ్ కూడా చేసుకోవచ్చు.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

ఇది రెండు వేరియంట్లలో (జిటిఎస్, జిటిఎస్ సూపర్) లభిస్తుంది. ఈ స్కూటర్‌లో పవర్‌ఫుల్ 278సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 22 హెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 21.69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

ఈ కొత్త ఫీచర్ల జోడింపుతో, ఒక స్కూటర్‌లో పైన తెలిపిన సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్న మొట్టమొదటి కంపెనీగా పియాజ్జియో రికార్డు సృష్టించింది. వెస్పా 946, ప్రమైవెరా, స్ప్రింట్ మోడళ్లలో కూడా ఇలాంటి కొన్ని సేఫ్టీ ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

పవర్‌ప్యాక్డ్ 'వెస్పా జిటిఎస్'

వెస్పా జిటిఎస్ స్కూటర్ వెస్పా 946 స్కూటర్ కన్నా తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, మరింత శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Vespa GTS, the most powerful scooter sold by the Italian two wheeler maker, has been updated with a slew of technological upgrades which includes ABS, traction control, a new Enhanced Sliding Suspension (ESS) and Vespa Multimedia Platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X