ఢిల్లీ ఆటో ఎక్స్‌పో: వెస్పా ఎస్ స్కూటర్ ఆవిష్కరణ

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న వెస్పా ఎస్ స్కూటర్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. పియాజ్జియో తమ స్పోర్టీ వెర్షన్ 125సీసీ స్కూటర్ 'వెస్పా ఎస్' (Vespa S)ను 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించింది. త్వరలోనే ఇది వాణిజ్య పరంగా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

వెస్పా ఎస్ అంటే వెస్పా స్పోర్ట్ అని అర్థం. ఇదొక క్లాసిక్ డిజైన్ కలిగిన స్పోర్టీ వెస్పా స్కూటర్. చూడటానికి దీని బేసిక్ డిజైన్ ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్, వెస్పా విఎక్స్‌ల మాదిరిగానే ఉంటుంది. అయితే, కొద్దిపాటి కాస్మోటిక్ మార్పులు, ఫీచర్ల మార్పులను ఇందులో గమనించవచ్చు. ప్రస్తుతం భారత్‌లో వెస్పా అందిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించనున్నారు.

వెస్పా ఎస్ స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వెస్పా ఎస్ స్కూటర్ ఆవిష్కరణ

వెస్పా ఎస్ మోడల్ బేసిక్ డిజైన్ వెస్పా ఎల్స్ఎక్స్ 125 మాదిరిగానే ఉంటుంది. అయితే, దీనికి ముందువైపు పురాతన మోడళ్లలో కనిపించినట్లుగా దీర్ఘచతుస్రాకారపు హెడ్‌లైట్ ఉంటుంది.

వెస్పా ఎస్ స్కూటర్ ఆవిష్కరణ

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా గతంలో మోడళ్ల నుంచి స్ఫూర్తిపొంది డిజైన్ చేసినదే. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేడ్ మరియు డిజిటల్ క్లాక్ ఉంటాయి.

వెస్పా ఎస్ స్కూటర్ ఆవిష్కరణ

ఈ స్కూటర్‌కు ముందువైపు ఒక వైపు మాత్రమే ఉండే షాక్ అబ్జార్వర్, ట్రేడ్ మార్క్ పొందిన వెస్పా మోనోకాక్ ఛాస్సిస్‌లను వెస్పా ఎస్ స్కూటర్‌లో గమనించవచ్చు.

వెస్పా ఎస్ స్కూటర్ ఆవిష్కరణ

ఈ స్కూటర్‌లో కూడా వెస్పా విఎక్స్ 125 మాదిరిగానే ముందువైపు డిస్క్ బ్రేక్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Vespa had confirmed last year that its new scooter model, the Vespa S, would be launched in India by the end of 2013. But that never happened. However, the launch of the new scooter is likely to happen this year as the Vespa S was showcased at the Auto Expo 2014.
Story first published: Wednesday, February 12, 2014, 10:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X