ఆటో ఎక్స్‌పో 2014: యమహా ఆల్ఫా స్కూటర్ విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా, దేశీయ విపణిలో మరో సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. యమహా ఆల్ఫా (Yamaha Alpha) పేరిట కంపెనీ ఓ సరికొత్త 110సీసీ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కొత్త ఆల్ఫా స్కూటర్‌ను విడుదల చేసింది. దేశీయ విపణిలో యమహా ఆల్ఫా స్కూటర్ ధర రూ.49,518 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


యమహా ఆల్ఫా కంపెనీ అందిస్తున్న రే, రే జెడ్ స్కూటర్ల మాదిరిగా కాకుండా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్ల వంటి డిజైన్‌ను పోలి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 113సీసీ ఇంజన్‌ను ఉపయయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
Yamaha Alpha Scooter Launched At Auto Expo 2014

ఈ స్కూటర్‌లో 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మొత్తం బరువు 104 కిలోలు. ఇది బ్లాక్, గ్రే, వైట్, రెడ్ మరియు మాగెంటా కలర్లలో లభిస్తుంది.
Most Read Articles

English summary
Yamaha has had plenty to show us today at the Auto Expo, ranging from motorcycles to concept models, some of which will launch in India in the future. But the one we'll speak about here is the Alpha, a 110cc segment scooter that was launched today.
Story first published: Wednesday, February 5, 2014, 17:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X