అన్ని ద్విచక్ర వాహనాల ధరలను తగ్గించిన యమహా

By Ravi

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కార్లు, మోటార్‌సైకిళ్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లపై బదిలీ చేసేందుకు యమహా సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ తమ ద్విచక్ర వాహనాల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా యమహా విక్రయిస్తున్న స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల ధరలను వేరియంట్‌ను బట్టి రూ.1033 నుంచి రూ.3066 వరకు తగ్గిస్తున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ధరల తగ్గుదల తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ వివరించింది.

Yamaha Announces Price Cut

ఈ సందర్భంగా, యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. ఆటో ఎక్స్‌పో తర్వాత మార్కెట్ సెంటిమెంట్ అధికంగా ఉన్న తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన ఈ ప్రకటన ఎంతో ప్రయోజనకరంగా ఉందని, ఈ నిర్ణయం వలన పరిశ్రమ వృద్ధి కనబరచగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్, ఎస్‌జెడ్-ఆర్ & ఎస్‌జెడ్-ఆర్ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc), రే (113cc), రే జెడ్ (113cc) మరియు ఆల్ఫా (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Yamaha India has announced a decision with respect to the transit as well as in-hand inventory lying with the dealers on account of the recent declaration on excise duty cut by the Finance Ministry. This announcement followed the company’s earlier notice to cut prices on all its models (including scooters) across India with immediate effect. The price cut ranges from Rs.1033 to Rs. 3066 depending on the variants.
Story first published: Monday, February 24, 2014, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X