అందుబాటులోకి రానున్న యమహా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా గడచిన సంవత్సరం జపాన్‌లో జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో 'పెస్1' (PES1 - ప్యాషన్ ఎలక్ట్రిక్ స్ట్రీట్‌‌స్పోర్ట్‌), 'పెడ్1' (PED1 - ప్యాషన్ ఎలక్ట్రిక్ డర్ట్) మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అయితే, మిగితా కాన్సెప్ట్ వాహనాల మాదిరిగా ఈ రెండు మోడళ్లు కేవలం కాన్సెప్ట్ దశకు మాత్రమే పరిమితం కాకుండా, ఉత్పత్తి దశకు కూడా చేరుకోనున్నాయి.

ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇందులో పెస్1 సిటీ రైడ్‌కు ఉద్దేశించి తయారు చేసినది కాగా పెడ్1 అనేది ఆఫ్-రోడింగ్ కోసం తయారు చేసిన ట్రైల్/డర్ట్ బైక్. ఇవి రెండూ కూడా పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి. ఇవి రెగ్యులర్ ఎలక్ట్రిక్ బైక్‌ల మాదిరిగా అండర్ పెర్ఫామెన్స్‌ను కాకుండా హై పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటాయి.

యమహా పెస్1, పెడ్1 ఎలక్ట్రిక్ బైక్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

యమహా పెస్1

యమహా పెస్1

ఇతర ఎలక్ట్రిక్ బైక్‌ల మాదిరిగానే యమహా పెస్1 ఎలక్ట్రిక్ బైక్ కూడా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. అయితే, యమహా స్మార్ట్ పవర్ మాడ్యూల్‌గా పిలిచే ఈ బ్యాటరీ ప్యాక్‌ను సులువగా తొలగించకోవచ్చు, అమర్చుకోవచ్చు.

యమహా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

ఈ బ్యాటరీ ప్యాక్‌లో విద్యుత్ బ్రష్‌లెస్ డిసి మోటార్‌కు పంపిణీ అవుతుంది. ఈ మోటార్ ఓ బెల్ట్ సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు తిరిగేలా చేస్తుంది. ఈ మోటార్ పవర్ వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

యమహా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

యమహా పెస్1 గురించి మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇది దీనిని తేలిక బరువు కలిగిన మోనోకాక్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఫలితంగా ఇది 100 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటుంది.

యమహా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

దీని తేలిక పాటి నిర్మాణ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, దీని ఛాస్సిస్ ఇటు ఫ్రేమ్ మాదిరిగాను అటు బాడీ మాదిరిగాను పనిచేస్తుంది. దీని పొడవు 1919 మి.మీ., వెడల్పు 640 మి.మీ., ఎత్తు 1000 మి.మీ.

యమహా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) ఉండదు. కానీ పెస్1లో ట్రాన్సిమిషన్ ఉంటుంది. రైడర్ ఎంపికను బట్టి దీనిని మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ మోడ్స్‌కు మార్చుకోవచ్చు.

యమహా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్

యమహా పెస్1 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను స్మార్ట్ ఫోన్ సాయంతో అనుసంధానం చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉండే ఆన్ బోర్డ్ కంప్యూటర్ సాయంతో స్మార్ట్ ఫోన్‌ను అనుసంధానం చేసి అన్ని రకాల సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు.

యమహా పెడ్1

యమహా పెడ్1

పెస్1 బైక్‌కు సీక్వెల్ వెర్షనే ఇది. పెస్1 రెగ్యులర్ అర్బన్ బైక్ కాగా, పెడ్1 ఓ డర్ట్/ట్రైల్ బైక్ లాంటిది. ఇందులో కూడా ఆటోమేటిక్ / మ్యాన్యువల్ గేర్‌బాక్స్, స్వాపబల్ బ్యాటరీ హబ్‌లు ఉంటాయి.

యమహా ఎవినో

యమహా ఎవినో

యమహా ఎవినో ఓ హైబ్రిడ్ స్కూటర్. భవిష్యత్తులో అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ కోసం ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఇందులో ఐసిఈ పవర్‌ట్రైన్ ప్లస్ లిథియం ఐయాన్ బ్యాటరీలతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి.

Most Read Articles

English summary
Yamaha had earlier showcased their concept electric motorcycles. Yamaha had earlier showcased their concept electric motorcycles the PED1 and PES1. They were showcased in 2013 Tokyo Motor Show. The bike has a very futuristic design and is a good way to showcase the Japanese automobile manufacturers design for the coming years.
Story first published: Thursday, April 24, 2014, 11:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X