యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల; ధర రూ.76,250

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా ఈనెల 30వ తేదీన ఓ సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, యమహా బైక్ ప్రియులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎఫ్‌జెడ్ సిరీస్‌లో రెండు సరికొత్త బైక్‌లను నేడు (30.06.2014వ తేదీన) విపణిలో విడుదల చేసింది. యమహా బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం చేతుల మీదుగా ఈ కొత్త బైక్‌లను మార్కెట్లో విడుదల చేశారు.

'యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2' (Yamaha FZ FI Version 2), 'యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 2' (Yamaha FZ-S FI Version 2) పేర్లతో కంపెనీ ఫుల్లీ అప్‌‍గ్రేడెడ్ బైక్‌లను పరిచయం చేసింది. ఈ రెండు మోడళ్ల ధరలు, సాంకేతిక వివరాలు, మార్పులు చేర్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ క్రింది స్లైడ్‌లలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 బైక్‌లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 సిరీస్ బైక్‌లలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఇదివరకటి 153సీసీ ఇంజన్‌కు బదులుగా రీడిజైన్డ్ 149సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

పాత కార్బురేటర్ స్థానంలో కొత్త ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను ఈ ఇంజన్‌లో జోడించారు. ఇందులో ఉపయోగించిన కొత్త టెక్నాలజీని బ్లూ కోర్ అని పిలుస్తారు.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2లో ఉపయోగించిన బ్లూ కోర్ టెక్నాలజీ, ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్‌ల వలన పవర్ లాస్ తగ్గి పెర్ఫార్మెన్స్ మరింత పెరగటంతో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుందని కంపెనీ వివరించింది.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త వెర్షన్ దాదాపు 14 శాతం అధిక మైలేజీనిస్తుందని యమహా పేర్కొంది.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

ఇందులో అమర్చిన రీడిజైన్డ్ 149సీసీ ఇంజన్ గరిష్టంగా 13.1 పిఎస్‌ల శక్తిని, 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కొత్తగా ఈకో ఇండికేటర్‌తో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఉపయోగించారు.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

ముందు, వెనుక సస్పెన్షన్ సిస్టమ్స్‌ను మార్చారు. బెటర్ రైడ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఛాస్సిస్‌లో కూడా మార్పులు చేశారు. ముందు వెనుక కొత్త టైర్లను అమర్చారు. బైక్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేశారు.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

కొత్త యమహా ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 మొత్తం బరువు 132 కేజీలు మాత్రమే (మునుపటి వెర్షన్ కన్నా 3 కేజీల బరువు తక్కువ). ఈ సెగ్మెంట్లో ఇదే తేలికైన 150సీసీ బైక్.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

ప్రతి 6000 కి.మీ. ఒక్కసారి చొప్పున ఎఫ్ఐ (ఫ్యూయెల్ ఇంజెక్షన్)ను క్లీన్ చేసుకోవాల్సిందిగా యమహా సూచిస్తోంది.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

18-30 ఏళ్ల వయస్సు కలిగిన యువతను టార్గెట్‌గా చేసుకొని ఈ బైక్‌ను ప్రవేశపెట్టామని, జులై 2014 నుంచి దీని డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.

యమహా ఎఫ్‌జెడ్ వెర్షన్ 2 విడుదల

దేశీయ విపణిలో ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ వెర్షన్ 2 ధర రూ.76,250లుగా ఉంటే, ఎఫ్‌జెడ్-ఎస్ ఎఫ్ఐ వెర్షన్ 2 ధర రూ.78,250లుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

Most Read Articles

English summary
Yamaha Motor India Sales Pvt. Ltd., today launched 2 new models to comprise its very successful FZ Series. The new models FZ Version 2.0 and FZ-S Version 2.0 are mounted with a newly designed air-cooled 149cc 4-stroke, SOHC, single-cylinder fuel-injected engine on a lightweight frame to realize the product concept of a “Sharpened & Power-packed New FZ.” With the launch of these new models targeted at young men between the ages of 18-30, the company hopes to see a steep growth in the customer base, especially keeping in mind the mileage conscious target audience.
Story first published: Monday, June 30, 2014, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X