మైలేజ్ మోటార్‌సైకిళ్లను పరిచయం చేయనున్న యమహా

By Ravi

సాధారణంగా యమహా మోటార్‌సైకిళ్లు పెర్ఫార్మెన్స్‌కు పెట్టింది పేరు. అందుకే, పెర్ఫార్మెన్స్‌కు ప్రధాన్యతనిచ్చే యూత్ ఫస్ట్ చాయిస్ యమహానే. అయితే, మైలేజ్ కోరుకునే వారు మాత్రం యమహా మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేయాలంటే వెనుకంజ వేస్తున్నారు. యమహా మోటార్‌సైకిళ్ల తయారీలో కంపెనీ పెర్ఫార్మెన్స్ విషయంలో చూపిన శ్రద్ధ, మైలేజ్‌పై చూపించలేదనిపిస్తుంది.

అందుకే, ఇప్పుడు యమహా ఇటు పెర్ఫార్మెన్స్‌తో పాటుగా అటు మైలేజ్‌లో కూడా ఎక్కడా రాజీపడకుండా ఉండేలా సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. భారత్ వంటి మార్కెట్లలో ఎక్కువగా మైలేజీనిచ్చే మోటార్‌సైకిళ్లకే కొనుగోలుదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, యమహా కూడా అధిక మైలేజీనిచ్చే ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.

Yamaha India To Introduce Fuel Efficient Motorcycles

ఆలస్యంగానైనా యమహా ఈ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఎంతో స్వాగతించదగినది. భవిష్యత్తులో యమహా అందిచబోయే అన్ని మోడళ్లలోను మరింత ఎక్కువ మైలేజీనిచ్చే ఇంజన్లను ఉపయోగించబోతోంది. అంతేకాకుండా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న యమహా మోడళ్లను సైతం ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ టెక్నాలజీతో ఇంప్రూవ్ చేయనుంది.

యమహా ప్రస్తుతం దేశీయ విపణిలో ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్ఎస్, ఫేజర్, ఆర్15 వంటి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. అలాగే.. ఆల్ఫా, రే, రే జెడ్ వంటి స్కూటర్లను యమహా విక్రయిస్తోంది. 150సీసీ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న యమహా గడచిన 2013-14 కాలంలో మొత్తం 3,07,511 మోటార్‌సైకిళ్లను విక్రయించింది.

Most Read Articles

English summary
Yamaha India has decided that it will be shifting its focus from performance motorcycles to more fuel efficient two wheelers. The Japanese manufacturer is known around the world for its track prowess and performance oriented machines.
Story first published: Monday, June 9, 2014, 11:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X