ధరల తగ్గింపుతో ఫిబ్రవరిలో భారీగా పెరిగిన యమహా సేల్స్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా గడచిన నెలలో ప్రోత్సాహకర అమ్మకాలను నమోదు చేసుకుంది. గడచిన నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ద్విచక్ర వాహనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. దేశవ్యాప్తంగా యమహా విక్రయిస్తున్న స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల ధరలను వేరియంట్‌ను బట్టి రూ.1033 నుంచి రూ.3066 వరకు తగ్గించింది.

ఫిబ్రవరి 2012లో యమహా మొత్తం 42,548 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం మొత్తం అమ్మకాల (32,097 యూనిట్ల)తో పోల్చుకుంటే ఇవి 32.5 శాతం అధికంగా నమోదయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆటో ఎక్స్‌పో 2014 సమయంలో కంపెనీ విడుదల చేసిన కొత్త ఉత్పత్తులు మరియు ప్రస్తుత నిర్వహిస్తున్న వినియోగదారుని సాన్నిహిత్య చర్యల వలన అమ్మకాలు ఓ సరికొత్త స్థాయికి చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.

Yamaha India Two Wheeler Sales

ఫిబ్రవరి నెల తమకెంతో అనుకూలమైన నెలని, పరిశ్రమలోను మరియు కంపెనీలు అనేక సానుకూల అభివృద్ధి పనులు చోటు చేసుకుంటాన్నయని, ఇదొక శుభ పరిణామమని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియెన్ వెల్లడించారు. ఆటో ఎక్స్‌పో 2014లో యమహా తమ సరికొత్త 110సీసీ స్కూటర్ ఆల్ఫాను విడుదల చేసింది.

ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్, ఎస్‌జెడ్-ఆర్ & ఎస్‌జెడ్-ఆర్ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc), రే (113cc), రే జెడ్ (113cc) మరియు ఆల్ఫా (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Japanese two-wheeler maker Yamaha has reported a 32.5 per cent increase in sales at 42,548 units in February 2014. The company had sold 32,097 units in the same month last year, Yamaha Motor India said in a release here.
Story first published: Monday, March 3, 2014, 16:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X