అప్‌గ్రేడెడ్ యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 బైక్ విడుదల

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్లను అన్నింటినీ క్రమంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా.. కంపెనీ విక్రయిస్తున్న 'యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్'లో రిఫ్రెష్డ్ వెర్షన్‌ను పరిచయం చేసింది.

యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 పేరిట విడుదల చేసిన ఈ రిఫ్రెష్డ్ వెర్షన్‌లో బ్లూకోర్ టెక్నాలజీని ఉపయోగించారు. బ్లూ కోర్ టెక్నాలజీ వలన పవర్ లాస్ తగ్గి పెర్ఫార్మెన్స్ మరింత పెరగటంతో పాటుగా మైలేజ్ కూడా పెరుగుతుందని కంపెనీ వివరించింది.

Yamaha Launch SZ RR Version 2

ఈ బైక్‌లో అమర్చిన రీడిజైన్డ్ 149సీసీ, ఎస్ఓహెచ్‌సి, సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 13.1 పిఎస్‌ల శక్తిని, 12.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది, ఇంధనం కార్బురేటర్ ద్వారా సప్లయ్ అవుతుంది.

యవతను లక్ష్యంగా చేసుకొని, వారి అవసరాలకు తగినట్లుగా కొత్త యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 మోటార్‌సైకిల్‌ను తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. దేశీయ విపణిలో యమహా ఎస్‌జెడ్-ఆర్ఆర్ వెర్షన్ 2.0 ధరను రూ.65,300 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.

Most Read Articles

English summary
Yamaha Motor India Sales Pvt. Ltd., launched its Version 2.0 SZ-RR model. The second generation of this motorcycle sports ‘Blue Core' technology. The Japanese engineers have improved fuel efficiency, performance and riding pleasure with their 2014 SZ-RR. The first model was launched back in 2013 and has been upgraded relatively soon.
Story first published: Monday, October 20, 2014, 15:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X