యమహా ఆర్25 బైక్ ఇప్పట్లో ఇండియాకు రాదు

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా గడచిన సంవత్సరం జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించిన తమ అధునాత 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'యమహా వైజెడ్ఎఫ్-ఆర్25'ను కంపెనీ ఇటీవలే ఇండోనేషియన్ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇండోనేషియాలో తయారు చేసిన యమహా ఆర్25 బైక్‌నే ఇతర దేశాలకు (భారత్‌‌కు కూడా) ఎగుమతి చేస్తామని కంపెనీ ప్రకటించింది.

యమహా ఆర్25 బైక్ ఇండోనేషియన్ యమహా కంపెనీ ఆన్‌లైన్ బుకింగ్‌‍లను ప్రారంభించింది. ఇలా ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ మోడల్ 2800 యూనిట్లకు పైగా ఆర్డర్లు వచ్చిపడ్డాయి. దీంతో స్థానిక (ఇండోనేషియా) మార్కెట్లోనే ఈ మోడల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఈ మోడల్‌ను ఇప్పట్లో ఇండోనేషియా ప్లాంట్ నుంచి ఎగుమతి చేయలేమని కంపెనీ చేతులెత్తేసింది.


ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో నెలకు 2000 యూనిట్ల ఆర్25 బైక్‌లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇండోనేషియా మార్కెట్లో ఈ డిమాండ్ ఇలానే కొనసాగితే, ఆర్25 ఎగుమతుల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. అంటే, ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్‌కు రావల్సిన యమహా ఆర్25 కాస్తా వచ్చే ఏడాది ఆరంభంలోనో లేక మధ్య భాగంలోనో విడుదలయ్యే ఆస్కారం ఉందన్నమాట.

యమహా ఆర్25 బైక్‌లో సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ డయాసిల్ (డై కాస్టింగ్ అల్యూమినియం సిలికాన్) అనే విశిష్టమైన సిలిండర్లను ఉపయోగించుకుంటుంది. దీని వలన ఇంజన్ బరువు తగ్గడమే కాకుండా, వేడి కూడా తక్కువగా ఉంటుంది. యమహా ఓ 2-సిలిండర్ ఇంజన్‌లో ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి.

Yamaha R25 Red

ఈ బైక్‌లోని 249సీసీ, లిక్విడ్ కూల్డ్, 2-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 హార్స్ పవర్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. యమహా అందిస్తున్న వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి రేస్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్25 బైక్‌ను డిజైన్ చేశారు.

యమహా ఆర్25 బైక్ డిజైన్ రేస్ బైక్‌ల డిజైన్‌ను తలపిస్తుంది. ప్రధానంగా దీని హెడ్‌లైట్ యమహా వైజెడ్ఆర్-ఎమ్1 నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసినట్లు ఉంటుంది. షార్ప్ టెయిల్ సెక్షన్, షార్ప్ లుకింగ్ ఫ్రంట్ కౌల్‌తో యమహా ఆర్25 మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్-సిరీస్ డిఎన్‌ఏ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్పోర్టీ లుక్‌ని, పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Yamaha has a stellar product in their 250cc offering, the R25.Yamaha Indonesia opened an Online booking system for their R25 and they received 2,800 motorcycle bookings in a single day. Due to high demand in the local market, Yamaha has announced that they will have to delay the R25 in other markets by at least a year.
Story first published: Tuesday, June 3, 2014, 15:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X