యమహా ఆర్25 మేకింగ్ (అఫీషియల్ వీడియో)

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా నుంచి ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో 'యమహా వైజెడ్ఎఫ్-ఆర్25' బైక్. ఇంటర్నెట్‌లో ఈ 250సీసీ బైక్ ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయింది. ఇటీవలే ఇండోనేషియాలో విడుదలైన యమహా ఆర్25 త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. మనం ఇదివరకటి కథనంలో ఈ బైక్ ట్రాక్ టెస్ట్‌కు సంబంధించిన ఓ వీడియోని వీక్షించాం.

ఆ వీడియోలో తమ యమహా ఆర్25 బైక్‌కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కంపెనీ వివరించింది. కాగా.. ఈ బైక్‌కి సంబంధించి తాజాగా మరో వీడియో యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. అదే యమహా ఆర్25 బైక్ మేకింగ్ వీడియోలో. యమహా ఫ్యాక్టరీలో ఈ బైక్ అసెంబ్లింగ్ నుంచి టెస్టింగ్ వరకు వివిధ దశలను చూపించే ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి.

యమహా ఆర్25 బైక్‌లో సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ బైక్‌లోని 249సీసీ, లిక్విడ్ కూల్డ్, 2-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 హార్స్ పవర్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. యమహా అందిస్తున్న వైజెడ్ఆర్-ఎమ్1 మోటోజిపి రేస్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఆర్25 బైక్‌ను డిజైన్ చేశారు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/mH22kZQgdnY?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
The Yamaha R25 is one of the most awaited launches this year in India. Now the Japanese manufacturer has released the making of the R25s twin-cylinder engine at the manufacturing plant, to keep the excitement of the bike alive. Take a look.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X