'యమహా రే 125' స్కూటర్ వస్తోంది

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ యమహా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'యమహా రే' స్కూటర్ త్వరలోనే మరింత శక్తివంతమైన ఇంజన్‌తో లభ్యం కానుంది. కొత్తగా 125సీసీ ఇంజన్‌తో కూడిన 'యమహా రే 125' స్కూటర్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యమహా రే మరియు రే జెడ్ స్కూటర్లలో 113సీసీ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 7.1 పిఎస్‌ల శక్తిని, 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొత్తగా రానున్న 125సీసీ యమహా రే స్కూటర్‌లో కూడా ఇదే ఇంజన్‌ను బోర్‌‌ను పెంచడం ద్వారా పెర్ఫార్మెన్స్ గణాంకాలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న స్పోర్టీ లుకింగ్ స్కూటర్లలో యమహా రే కూడా ఒకటి. యమహా రే 125 కూడా ఇదే తరహా డిజైన్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది 125సీసీ ఇంజన్‌తో రానున్న నేపథ్యంలో, ఇది మరింత హై పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. అయితే, ఇదే సమయంలో యమహా ఈ స్కూటర్‌ను మైలేజ్ ఫ్రెండ్లీగా ఉంచేందుకు కృషి చేస్తోంది. యమహా రే 125 ఓ హై పెర్ఫామెన్స్ స్కూటర్‌ కావడంతో ఇందులో డిస్క్ బ్రేక్స్‌ను ఆప్షనల్ ఫీచర్‌గా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన 2014 ఆటో ఎక్స్‌పోలో యమహా ఆల్ఫా (Yamaha Alpha) పేరిట కంపెనీ ఓ సరికొత్త 110సీసీ స్కూటర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో యమహా ఆల్ఫా స్కూటర్ ధర రూ.49,518 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. యమహా ఆల్ఫా కంపెనీ అందిస్తున్న రే, రే జెడ్ స్కూటర్ల మాదిరిగా కాకుండా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్ల వంటి డిజైన్‌ను పోలి ఉంటుంది. ఈ స్కూటర్‌లో కూడా రే మోడళ్లలోని ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 113సీసీ ఇంజన్‌నే ఉపయయోగిస్తున్నారు.

Yamaha Alpha

ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మొత్తం బరువు 104 కిలోలు. ఇది బ్లాక్, గ్రే, వైట్, రెడ్ మరియు మాగెంటా కలర్లలో లభిస్తుంది.
Most Read Articles

English summary
Yamaha Ray, the Japanese two wheeler maker's popular scooter offering in India would be available in a 125cc variant this year, according to a report.
Story first published: Friday, February 14, 2014, 14:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X