'యమహా రే ప్రీషియస్' లిమిటెడ్ ఎడిషన్ విడుదల; ధర, ఇతర వివరాలు

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, భారత మార్కెట్లో మహిళల కోసం విక్రయిస్తున్న రే స్కూటర్‌లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. యమహా రే ప్రీషియస్ (Yamaha Ray Precious) అనే పేరుతో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ రెగ్యుల్ రే స్కూటర్ కన్నా భిన్నంగా ఉంటుంది. పేరుకు తగినట్లుగానే దీనిని మహిళల కోసం మరింత ప్రీషియస్‌గా డిజైన్ చేశారు.

అయితే, యమహా రే ప్రీషియస్ ఎడిషన్‌లో కొత్త బాడీ గ్రాఫిక్స్ తప్ప కొత్త ఫీచర్లేవీ లేవు. రెగ్యుల్ రే స్కూటర్‌కు కొత్త బాడీ గ్రాఫిక్స్‌ను జోడించారు. వీటిపై ప్రీషియస్ ఎడిషన్ అనే బ్యాడ్జింగ్ ఉంటుంది. యమహా రే ప్రీషియస్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని ఫొటోలను, మరింత సమాచారాన్ని మరియు ఈ స్కూటర్ విడుదల గురించి కంపెనీ అధికారులు ఏమన్నారో తెలుసుకుందాం రండి.

ధర ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

యమహా రే ప్రీషియస్ లిమిటెడ్ ఎడిషన్

యమహా రే ప్రీషియస్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 113సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7 హార్స్ పవర్‌ల శక్తిని, 8.1 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

యమహా రే ప్రీషియస్ లిమిటెడ్ ఎడిషన్

దేశీయ విపణలో యమహా రే ప్రీషియస్ స్పెషల్ ఎడిషన్ ధర రూ.48,605 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కాగా.. రెగ్యులర్ వెర్షన్ యమహా రే కేవలం రూ.47,107 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకే లభ్యమవుతుండగా, పురుషుల కోసం కంపెనీ అందిస్తున్న యమహా రే జెడ్ ధర రూ.49,105 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

యమహా రే ప్రీషియస్ లిమిటెడ్ ఎడిషన్

తమ యమహా రే స్కూటర్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఇందులో ప్రీషియస్ అనే స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెడుతున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియెన్ చెప్పారు.

యమహా రే ప్రీషియస్ లిమిటెడ్ ఎడిషన్

తమ కస్టమర్లకు వారి వ్యక్తిగత స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా కొత్త స్టయిలిష్ డిజైన్లను రే స్కూటర్‌లో ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో యమహా రే ప్రీషియస్ ఎడిషన్‌ను విడుదల చేశాయమని ఆయన అన్నారు.

యమహా రే ప్రీషియస్ లిమిటెడ్ ఎడిషన్

భారత మార్కెట్లో తమ స్కూటర్ బ్రాండ్ మంచి సక్సెస్‌‌ను సాధించిందని, భవిష్యత్తులో కూడా ఈ సక్సెస్ ఇలానే కొనసాగుతుందని రాయ్ కురియెన్ ధీమా వ్యక్తం చేశారు.

Most Read Articles

English summary
Yamaha Ray, the company's first scooter in India is marketed as a feminine vehicle. Keeping up with its image the brand also sponsors certain beauty pageants. Their latest limited production Precious Edition seems to be the result of that, which also serves the dual purpose of attracting buyers during the festive season.
Story first published: Thursday, September 19, 2013, 12:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X