ఇండియా డిజైన్ మార్క్ అవార్డ్ గెలుచుకున్న యమహా రే జెడ్

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా మోటార్ ఇండియా పురుషులను టార్గెట్‌గా చేసుకొని ప్రవేశపెట్టిన యమహా రే జెడ్ (Yamaha Ray Z), ఇప్పుడు భారత అత్యున్నత అవార్డును గెలుచుకుంది. డిజైన్ విషయంలో ఇది 'ఇండియా డిజైన్ మార్క్' (ఐ మార్క్) అవార్డును సొంతం చేసుకుంది. ఇండియా డిజైన్ కౌన్సిల్ యమహా రే జెడ్ స్కూటర్‌ను ఈ అవార్డు కోసం ఎంపిక చేసింది.

గడచిన రెండేళ్లలో వరుసగా యమహా వైజెజ్ఎఫ్-ఆర్15 మరియు యమహా రే స్కూటర్లు ఐ మార్క్ అవార్డును గెలుచుకోగా, ఇప్పుడు వరుసగా మూడోసారి కూడా యమహానే ఐ మార్క్ డిజైన్‌ను సొంతం చేసుకోవటం విశేషం. భారత వాణిజ్య, పరిశ్రమల శాకతో ముడిపడి ఉన్న ఇండియా డిజైన్ కౌన్సిల్‌లో అకాడెమియా, డిజైన్ మరియు పరిశ్రమ సంస్థళకు చెందిన ప్రముఖులు ఉంటారు.

ఈ కౌన్సిల్ యొక్క ఇండియా డిజైన్ మార్క్ (ఐ మార్క్) అవార్డ్ ప్రోగ్రామ్‌ను జపాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రొమోషన్ సహకారంతో ఇవ్వటం జరుగుతుంది. యమహా 2012లో తమ రే స్కూటర్ విడుదల ద్వారా భారత స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. తొలుత భారతీయ మహిళల కోసం రే స్కూటర్‌ను విడుదల చేసిన యమహా ఆ తర్వాత పురుషుల కోసం రే జెడ్‌ను విడుదల చేసింది. ఇటీవలే యమహా ఆల్ఫా అనే కొత్త స్కూటర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది.

Yamaha Ray Z

యమహా రే జెడ్ స్కూటర్‌లో 113సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద8.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 53 కి.మీ. మైలేజీనిస్తుంది. యమహా రే జెడ్ స్కూటర్ కూడా రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.

ప్రస్తుతం యమహా దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్-ఎక్స్, ఎస్‌జెడ్-ఆర్ & ఎస్‌జెడ్-ఆర్ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc), క్రక్స్ (106cc), రే (113cc), రే జెడ్ (113cc) మరియు ఆల్ఫా (113cc) స్కూటర్లను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Yamaha Motor India 'Ray Z' scooter has received the India Design Mark (I Mark) awarded by the India Design Council. Following the last two years’ award for the YZF-R15 and Yamaha Ray, this is Yamaha’s third consecutive I Mark award.
Story first published: Thursday, May 8, 2014, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X