ఇంజన్ సమస్య; ఆల్ఫా స్కూటర్లను రీకాల్ చేసిన యమహా

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా, గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 110సీసీ స్కూటర్ 'యమహా ఆల్ఫా' (Yamaha Alpha)ను కంపెనీ తాజాగా రీకాల్ చేసింది. ఇంజన్‌లో చిన్న సమస్య కారణంగా కంపెనీ వీటిని వెనక్కు పిలిపిస్తున్నట్లు సమాచారం.

యమహా ఆల్ఫా స్కూటర్ ఇంజన్‌లోని సిలిండర్ హెడ్‌లోని ఓ-రింగ్ సమస్య కారణంగా ఇంజన్ ఆయిల్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఈ రీకాల్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యమహా తమ మొబైల్ నెంబర్లు రిజిస్టర్ చేసుకున్న ఆల్ఫా యూజర్లందరికీ ఎస్ఎమ్ఎస్ ద్వారా ఈ విషయం తెలియజేసినట్లు సమాచారం.

అలాగే, యమహా డీలర్లు కూడా ఫోన్ ద్వారా తమ ఆల్ఫా కస్టమర్లను సంప్రదిస్తున్నారు. ఈ సమస్యను సరిచేయటానికి దాదాపు 3 గంటల సమయం పడుతుందని అంచనా. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత యమహా డీలరును సంప్రదించగలరు.

Yamaha Recalls Its Alpha Scooter In India

యమహా ఆల్ఫా ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రే, రే జెడ్ స్కూటర్ల మాదిరిగా కాకుండా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ మోడళ్ల మాదిరిగా ఫ్యామిలీ డిజైన్‌ను కలిగి ఉంటుందియ ఈ స్కూటర్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, 113సీసీ ఇంజన్‌ను ఉపయయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్‌లో 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని మొత్తం బరువు 104 కిలోలు. ఇది బ్లాక్, గ్రే, వైట్, రెడ్ మరియు మాగెంటా కలర్లలో లభిస్తుంది.

Most Read Articles

English summary
The Yamaha Alpha which was launched some time ago has been recalled for an engine issue. The issue has been raised due to a possible oil leakage problem. Engineers believe there could be an issue with their O-Ring in the cylinder head.
Story first published: Thursday, January 8, 2015, 17:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X