ఏబిఎస్ ఆప్షన్‌తో లభ్యం కానున్న యమహా వైజెడ్ఎఫ్-ఆర్25

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా గడచిన సంవత్సరం జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించిన తమ అధునాత 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'యమహా వైజెడ్ఎఫ్-ఆర్25'ను కంపెనీ ఈ ఏడాది ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ బైక్ కేవలం ఇండేనేషియా మార్కెట్లోనే కాకుండా పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో (భారత్‌లో) కూడా త్వరలోనే లభ్యం కానుంది.

ప్రస్తుతం యమహా వైజెడ్ఎఫ్-ఆర్25 డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ డిస్క్ బ్రేక్) అందుబాటులో లేదు. ఇప్పటికే, పలు దేశాల్లో సేఫ్టీ ఫీచర్లు కఠినతరం అవుతున్న నేపథ్యంలో, యమహా తమ లేటెస్ట్ 250సీసీ బైక్‌లో కూడా ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌ను ఆఫర్ చేస్తామని ప్రామిస్ చేసింది. వచ్చే ఏడాది నుంచి ఏబిఎస్ వెర్షన్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్25 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.


యమహా ఆర్1, ఆర్6, ఎమ్1 మోటోజిపి బైక్‌లను స్ఫూర్తిపొంది యమహా వైజెడ్ఎఫ్-ఆర్25 బైక్‌ను తయారు చేశారు. అందుకే, దీని డిజైన్ రేస్ బైక్‌ల డిజైన్‌ను తలపిస్తుంది. ప్రధానంగా దీని హెడ్‌లైట్ యమహా వైజెడ్ఆర్-ఎమ్1 నుంచి స్ఫూర్తి పొంది తయారు చేశారు.

ఈ బైక్‌లో సరికొత్త 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ డయాసిల్ (డై కాస్టింగ్ అల్యూమినియం సిలికాన్) అనే విశిష్టమైన సిలిండర్లను ఉపయోగించుకుంటుంది. దీని వలన ఇంజన్ బరువు తగ్గడమే కాకుండా, వేడి కూడా తక్కువగా ఉంటుంది. యమహా ఓ 2-సిలిండర్ ఇంజన్‌లో ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి.

Yamaha R25 ABS

యమహా ఆర్25 బైక్‌లో 249సీసీ, లిక్విడ్ కూల్డ్, 2-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 హార్స్ పవర్‌ల శక్తిని, 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 22.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‍‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

షార్ప్ టెయిల్ సెక్షన్, షార్ప్ లుకింగ్ ఫ్రంట్ కౌల్‌తో యమహా ఆర్25 మంచి స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్-సిరీస్ డిఎన్‌ఏ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది స్పోర్టీ లుక్‌ని, పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుంది. యమహా ఆర్25 తేలికపాటి నిర్మాణాన్ని కలిగి ఉండి, ఎక్సలెంట్ సెంట్రలైజేషన్‌ను కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 166 కేజీలు. ఇధి 2.09 మీ పొడవును, 0.720 మీట వెడల్పును, 1.135 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. దీని సైట్ హైట్ 0.780 మీటర్లు. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు.

Most Read Articles

English summary
Yamaha launched its R25 sans ABS, however, since many countries are making safety features mandatory. The Japanese manufacturer will offer their R3 with ABS as standard, while the R25 will have the option.
Story first published: Saturday, November 15, 2014, 14:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X