ఇండియా బైక్ వీక్ 2015: యువరాజ్ సింగ్ కస్టమైజ్డ్ బైక్

By Ravi

గోవాలో జరిగిన మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్‌లో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ కస్టమైజ్డ్ కెటిఎమ్ డ్యూక్ 390 మోటార్‌సైకిల్‌ను ప్రదర్శనకు ఉంచారు. కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌ను ఆధారంగా చేసుకొని ఈ బైక్‌ను కస్టమైజ్ చేశారు.

ముకుల్ నందన్‌కు చెందిన ఆటోలాగ్ కంపెనీ ఈ బైక్‌ను కస్టమైజ్ చేసింది. కెటిఎమ్ డ్యూక్‌ల కోసం యువీకెన్ కెటిఎమ్ ఎక్స్12తో పాటుగా ఎక్స్26 బాడీ కిట్‌లను కూడా ఈ కంపెనీ ఇండియా బైక్ వీక్ 2016లో ప్రదర్శనకు ఉంచింది.

ఇంకా రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ కిట్, హీరో ఇంపల్స్ ఆఫ్-రోడ్ కిట్, రెక్ అనే కస్టమ్ బైక్ మరియు కస్టమైజ్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేస్ మోటార్‌సైకిళ్లను కూడా ఈ కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

ఇదే 'యువరాజ్' కస్టమైజ్డ్ బైక్!

తర్వాతి స్లైడ్‌లలో యువరాజ్ సింగ్ కస్టమైజ్డ్ కెటిఎమ్ బైక్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

ఇదే 'యువరాజ్' కస్టమైజ్డ్ బైక్!

యువరాజ్ సింగ్ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఈ బ్లూ కలర్ మోడిఫైడ్ కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌కి 'యువీకెన్ ఎక్స్12' (YOUWECAN X12) అనే పేరు పెట్టారు.

ఇదే 'యువరాజ్' కస్టమైజ్డ్ బైక్!

యువీకెన్ ఎక్స్12 బైక్‌ను ప్రముఖ ఆటోమొబైల్స్ కస్టమైజేషన్, రీస్టోరేషన్ స్పెషలిస్ట్ ఆటోలాగ్ డిజైన్ సంస్థ కస్టమైజ్ చేసింది.

ఇదే 'యువరాజ్' కస్టమైజ్డ్ బైక్!

కెటిఎమ్ మోటార్‌సైకిల్‌ను ఆధారంగా చేసుకొని యువరాజ్ సింగ్ కోసం ఈ బైక్‌ను స్పెషల్‌గా కస్టమైజ్ చేశారు. ఈ కస్టమైజ్డ్ బైక్‌లో కాస్మోటిక్ మార్పులు తప్ప పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ లేవని సమాచారం.

ఇదే 'యువరాజ్' కస్టమైజ్డ్ బైక్!

మూడవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌ను గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద ఫిబ్రవరి 20, 2015 మరియు ఫిబ్రవరి 21, 2015 తేదీలలో నిర్వహించారు.

ఇదే 'యువరాజ్' కస్టమైజ్డ్ బైక్!

భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో దేశ విదేశాలకు చెందిన బైకర్లు పాల్గొన్నారు.

Most Read Articles

English summary
Biker Mania Engulfs Goa with Yuvraj launching new custom bike design, 2500 HOG riders & charity ride at India Bike Week 2015.
Story first published: Monday, February 23, 2015, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X