భారతదేశపు తొలి మ్యాక్సీ-స్కూటర్: సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ రివ్యూ

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ఒకటి. విడుదలైన అనతి కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేశాము.

భారత్‌లో టూ వీలర్ల పరిశ్రమ శరవేగంగా వృద్ది చెందుతోంది. అత్యంత కఠినమైన ట్రాఫిక్‌లో ఎంతో సులభంగా ప్రయాణించడానికి వీలుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో స్కూటర్ల పరిశ్రమ తనదైన శైలిలో రాణిస్తోంది. పట్టణాల్లో మైలేజ్ కాదని, పర్పామెన్స్‌ ఇచ్చే స్కూటర్లను కోరుకుంటున్న కస్టమర్ల కోసం ఇటీవల పలు 125సీసీ స్కూటర్లు విడుదలయ్యాయి.

Advertisement

వీటిలో, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ఒకటి. విడుదలైన అనతి కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేశాము.

Advertisement

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ కంపెనీ యొక్క లేటెస్ట్ మోడల్. దేశీయంగా ఉన్న మిగతా అన్ని స్కూటర్లతో పోల్చుకుంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది మరియు ఇది భారతదేశపు మొట్టమొదటి మ్యాక్సీ స్కూటర్. సుజుకి అంతర్జాతీయ విపణిలో ఉన్న బర్గ్‌మ్యాన్ 650 డిజైన్ శైలిలో ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేశారు.

సుజుకి యాక్సెస్ 125 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా, దీనికి కంటే రూ. 8,800 ఎక్కువ ధరతో వచ్చిన సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ధరకు విలువలను కలిగి ఉందా...? లేదంటే కొత్త బట్టలేసుకున్న యాక్సెస్ 125 తరహాలోనే ఉందా...? అసలు దీనిని ఎంచుకోవచ్చా... ఎంచుకోకూడదా...? ఇవాళ్టి రివ్యూలో క్లుప్తంగా...

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ డిజైన్ విషయానికి వస్తే, ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్లతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా మరియు కొత్తగా ఉంటుంది. కొలతల పరంగా ఇది 125సీసీ స్కూటర్ అంటే నమ్మశక్యం కాదు. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే కండలు తిరిగిన ఫ్రంట్ డిజైన్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి.

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ శరీర భాగాలను తీక్షణంగా పరిశీలిస్తే, ఉలితో చెక్కినటువంటి చక్కని రూపాన్ని గమనించవచ్చు. క్రోమ్ హంగులను అందించేందుకు వీలైనన్ని ప్రదేశాల్లో క్రోమ్ ఎలిమెంట్లను జోడించడం జరిగింది. రియర్ డిజైన్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్ కలదు, అయితే, ఎల్ఈడీ బదులుగా హ్యాలోజియన్ లైట్లను అందించారు.

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 నిర్మాణం పెద్దగా ఉండటంతో, పొడవాటి మరియు విశాలమైన సీటు సాధ్యమైంది. రైడర్‌తో పాటు తోటి రైడర్‌కు కూడా సౌకర్యవంతమైన అనుభవాన్నిస్తుంది. అంతే కాకుండా, సీటుకు చివర్లో పెద్ద పరిమాణంలో గ్రాబ్ రెయిల్ ఉంది. మరియు డిజైన్ మొత్తాన్ని డామినేట్ చేయగల భారీ పరిమాణంలో ఉన్న ఎగ్జాస్ట్ మఫ్లర్ ఉంది.

ఇందులో సరిపోలని అంశం ఏమిటంటే... 10-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్‌కు 100మిల్లీమీటర్ల కొలతల్లో ఉన్న టైర్లు రావడం. స్కూటర్ రియర్ డిజైన్‌కు అనుగుణంగా, వెనుక వైపున పెద్ద పరిమాణంలో టైరును అందించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం.

ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చిన మొట్టమొదటి స్కూటర్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్. పెద్ద పరిమాణంలో ఉన్న స్క్రీన్‌లో వైట్ బ్యాక్ లైటింగ్ కలదు. దీంతో ఎంతటి ప్రకాశవంతమైన రోజులో కూడా స్కీన్ మీద ఉన్న సమాచారాన్ని చదవగలం. ఈ స్క్రీన్‌లో స్పీడో మీటర్, ఓడో మీటర్, రెండు ట్రిప్ మీటర్లు, క్లాక్ మరియు ఫూయల్ గేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో పలు రకాల కొత్త ఫీచర్లు పరిచయం అయ్యాయి. ముందు వైపున రెండు పెద్ద స్టోరేజ్ ప్రదేశాలున్నాయి. సుజుకి కథనం ప్రకారం, ఇక్కడ 2-లీటర్ల వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, మరో పక్కన 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కలదు, అందులోనే ఫోన్ భద్రపరుచుకోవచ్చు. ఫుట్ బోర్డ్ వద్ద రెండు హుక్‌లు కూడా ఉన్నాయి.

ఫుట్‌బోర్డ్ చాలా విశాలంగా ఉంది, ఈ శ్రేణిలో ఉన్న మరెలాంటి స్కూటర్లలో కూడా ఇలాంటి ఫుట్ బోర్డ్ చూడలేము. అంతే కాకుండా, లాంగ్ రైడ్ చేస్తున్నపుడు కాళ్లను చాచుకుని రైడ్ చేసేందుకు ఫుట్ బోర్డు మీద ప్రత్యేకమైన ఫుట్ సపోర్ట్ డిజైన్ కలదు. మల్టీ ఫంక్షన్ కీ ద్వారా ఓపెన్ అయ్యే అండర్ సీట్ స్టోరేజీలో 21.5-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉంది. అయితే, అండర్ స్టోరేజ్‌లో ఎల్ఈడీ లైట్ మిస్సయ్యింది.

సాంకేతికంగా సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో సుజుకి యాక్సెస్ 125 నుండి సేకరించిన అదే శక్తివంతమైన 124సీసీ సింగల్ సిలిండర్ సీవీటీ ఇంజన్ కలదు. నిజానికి ఇది 7000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8.6బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమ్ వద్ద 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ సౌండ్ చాలా వరకు తక్కువగా ఉంది. పట్టణ అవసరాలకు కావాల్సిన అత్యుత్తమ పనితీరు దీని సొంతం.

మెరుగైన మైలేజ్ కోసం పరిమిత వేగం వరకు వెళ్లేందుకు ఇందులో సుజుకి ఇకో పర్ఫామెన్స్ రైడింగ్ మోడ్ కలదు. యాక్సెస్ 125 లో నుండి సేకరించిన ఈ టెక్నాలజీ ద్వారా స్కూటర్ మైలేజ్ కొద్ది వరకు మెరుగుపడుతుంది.

సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఏ ఒక్క బ్రేక్ ప్రయోగించినా... బ్రేక్ పవర్ రెండు చక్రాలకు సమాంతరంగా సరఫరా చేసే కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. ముందు వైపున డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. సడెన్ బ్రేకులు వేసినపుడు, ఫ్రంట్ బ్రేక్ బాగా ఉన్నప్పటికీ, రియర్ బ్రేక్ లాక్ అయినట్లు అనిపిస్తుంది.

సస్పెన్షన్ పరంగా సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125సీసీ స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉన్నాయి. సాధారణ వేగం వద్ద స్పీడ్ బంప్స్ నుండి వచ్చే కుదుపులను చక్కగా గ్రహించింది. హ్యాండిల్ బార్ విషయానికి వస్తే యాక్సెస్ 125 తో పోల్చినపుడు దీని హ్యాండిల్ చాలా క్రిందకు ఉంటుంది. యు-టర్న్ తీసుకుంటున్నపుడు చాలాసార్లు మోకాళ్లను తాగడం గుర్తించాను. ఏదేమైనప్పటికీ 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న వారి కోసం సరైన కొలతల్లో వచ్చిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్.

సుజుకి ప్రతినిధుల కథనం మేరకు, బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 గరిష్ట మైలేజ్ లీటరుకు 53కిలోమీటర్లుగా ఉంది. అసలైన రహదారి పరిస్థితుల్లో పరీక్షించినపుడు సగటున లీటరుకు 45కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. 125సీసీ సెగ్మెంట్లో ఇది అంత సులభమేమీ కాదు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 5.6 లీటర్లు. ఒక్కసారి పూర్తిగా నింపితే దాదాపు 250కిమీలు ప్రయాణించవచ్చు.

తెలుగు డ్రైవ్‍‌స్పార్క్ అభిప్రాయం!

స్టైల్ మరియు ఫ్యాన్సీని భారతీయులు బాగానే ఇష్టపడతారు, ఈ విషయంలో సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ఇండియన్ కస్టమర్లను ఏ మాత్రం నిరుత్సాహపరచదు. విలక్షమైన మరియు ఖరీదైన ఫీల్ కలిగించే డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన మరియు మెరుగైన మైలేజ్ ఇవన్నీ కూడా అత్యంత సరసమైన కేవలం రూ. 68,000 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరలో లభించే సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌తో సాధ్యమవుతున్నాయి.

దేశీయంగా 125సీసీ స్కూటర్ల విభాగంలో సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ధరకు తగ్గ విలువలను మెరుగైన ఎంపిక అనేది మా అభిప్రాయం! మరి మీ అభిప్రాయం ఏంటో క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...

TRENDING

English Summary

Read In Telugu: Suzuki Burgman Street Road Test Review — India's First Maxi-Scooter