లోపాలున్న కారును అంటగట్టినందుకు మారుతికి తగిన శాస్తే జరిగింది

అహ్మదాబాద్‌లోని వినియోగదారుల కోర్టు దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌కు చివాట్లు పెట్టింది. అంతే కాకుండా, కస్టమరును మోసం చేసినందుకు భారీ జరిమానా విధించింది.

అహ్మదాబాద్‌లోని వినియోగదారుల కోర్టు దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌కు చివాట్లు పెట్టింది. అంతే కాకుండా, కస్టమరును మోసం చేసినందుకు భారీ జరిమానా విధించింది.

నలీన్ బాయ్ ఆ కారును సమీపంలోని మారుతి డీలర్ వద్దకు తీసుకెళ్లి, మాటిమాటికీ ఆగిపోతోందని ఫిర్యాదు చేశాడు. కొనుగోలు చేసి కనీసం ఏడాది కూడా పూర్తికాకముందే అనూహ్యంగా ఎదురైన సాంకేతికంగా సమస్యలతో లోపాలున్న కారు లభించినందుకు తీవ్రంగా నిరుత్సాహం చెందాడు.

కారు మొత్తం 17,000 కిలోమీటర్లు మాత్రమే నడిచింది మరియు వారంటీ కూడా ఉంది. అయినప్పటికీ, ఉచితంగా రిపేరీ చేయడానికి మారుతి డీలర్ ఒప్పుకోకపోవడంతో ఏకంగా కంపెనీనే గుజరాత్‌లోని వినియోగదారుల కోర్టుకు ఈడ్చాడు.

అయితే, వాదోపవాదనలు విన్న వినియోగదారుల కోర్టు కస్టమరుకు ఇచ్చిన కారు స్థానంలో కొత్త కారును ఇవ్వాలి లేదంటే కస్టమర్ చెల్లించిన రూ. 5.41 లక్షల మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని మారుతి సుజుకి సంస్థకు సూచించింది. అంతే కాకుండా, కస్టమరును మానసిక క్షోభకు గురిచేసినందుకు మరో రూ. 3,000 అదనంగా చెల్లించాలని పేర్కొంది.

పోరుబందర్‌లోని దిగువ కోర్టు ఉత్తర్వుల మేరకు కొత్త కారును ఇవ్వడం లేదా కారు మొత్తం ధరను వెనక్కి చెల్లించాలని పేర్కొనడంతో వినియోగదారుల కోర్టు కమీషన్ కంపెనీకి కొంచం సమయాన్నిచ్చింది. కోర్టు ఆర్డరు ప్రకారం, కారులోని లోపమున్న అన్ని విడి భాగాల స్థానంలో కొత్త వాటిని అందించి సెప్టెంబర్ 15న కస్టమరుకు అప్పగించాల్సిం ఉంది.

అయితే, మారుతి సుజుకి ప్రతినిధులు మాత్రం, కారు డ్రైవర్‌ సరైన అవగాహన లేకుండా నడపంతో కారులోని పలు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, కారు క్రింది వైపున కూడా తీవ్రంగా డ్యామేజ్ అయినట్లు వాధించింది. ఏదేమైనప్పటికీ కోర్టులో ఆధారాలతో సహా నిరూపించలేకపోయింది.

ఏదేమైనా... ఉద్దేశపూర్వకంగా లేదంటే అనుకోకుండా సాంకేతిక లోపం ఉన్న ఉత్పత్తులను కంపెనీలు కస్టమర్లకు డెలివరీ చేస్తాయి. అయితే, కస్టమర్ ఆ సమస్యలను గుర్తించిన తరువాత బాధ్యతాయుతంగా సర్వీస్ అందించాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి.

Read more...