అర్కానా కూపే క్రాసోవర్ కారును ఆవిష్కరించిన రెనో

ఫ్రెంచ్ దిగ్గజం రెనో కొన్ని రోజుల క్రితం అర్కానా పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పుడు, సరికొత్త రెనో అర్కానా కూపే క్రాసోవర్ కారును 2018 మాస్కో మోటార్ షోలో అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. ఈ క్రాసోవర్ మోడల్ పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, కంపెనీ యొక్క కీలకమైన ఉత్పత్తిగా నిలవనుంది.

సెడాన్ మరియు ఎస్‌యూవీల డిజైన్ అంశాల మేళవింపులతో చక్కగా రూపొందించిన క్రాసోవర్ మోడల్ ఈ రెనో అర్కారా. రెనో క్యాప్చర్ ఆధారంగా నిర్మించిన రెనో అర్కారా 5-సీటర్ కూపే క్రాసోవర్. ఫ్రంట్ డిజైన్‌లో పదునైన స్టైలింగ్ మరియు అధునాతన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.

రెనో అర్కానా క్రాసోవర్‌లోని స్లోపింగ్ రూఫ్ టాప్ డిక్కీ వరకుగా ఎంతో అందంగా పొడగించారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 19-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అర్కానా ఓవరాల్ డిజైన్ అటు సెడాన్ మరియు ఎస్‌యూవీ రెండింటినీ పోలి ఉంటుంది.

రెనో అర్కానా రియర్ డిజైన్‌లో స్పోర్టివ్ బంపర్, రెండు ఎగ్జాస్ట్ పైపులు మరియు ఇరువైపులా ఉన్న టెయిల్ లైట్లను అనుసంధానం చేస్తూ డిక్కీ డోరు మీదుగా వెళ్లే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ స్ట్రిప్ కలదు. ముందు మరియు వెనుక వైపున స్కిడ్ ప్లేట్లు మరియు స్లిమ్ముగా కనిపించే అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ చూడవచ్చు.

రెనో అర్కానా క్రాసోవర్ కారును రష్యా వెర్షన్ డస్టర్ మరియు డాసియా ఎస్‌యూవీలను నిర్మించిన అదే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. ప్రస్తుతానికి రెనో అర్కానా సాంకేతికంగా వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు. కానీ రష్యా మార్కెట్లో విక్రయిస్తున్న రెనో కార్లలోని ఇంజన్ ఉపయోగించే అవకాశం ఉంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇది ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌లో కూడా లభించనుంది. రెనో అర్కానా కూపే క్రాసోవర్ కారును తొలుత 2019 ప్రారంభంలో రష్యా మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాస్త ఆలస్యంగా ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

Most Read:మహీంద్రా మరాజొ విడుదల: ధర రూ. 9.9 లక్షలు

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

రెనో అర్కానా స్టైలిష్ సెడాన్ మరియు ధృడమైన ఎస్‌యూవీ డిజైన్ కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త కూపే క్రాసోవర్. రెనో అర్కానా డిజైన్ పరంగా చాలా విభిన్నమైన మోడల్. రెనో అర్కానా నిజానికి ఇండియన్స్ మెచ్చే మోడల్ కాదు, ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి మోడళ్లు వచ్చిందీ లేదు, సక్సెస్ అందుకున్న దాఖలాలు అంతకన్నా లేవు. అయితే, క్రాసోవర్ వాహనాలను ఎక్కువగా ఇష్టపడే యూరోపియన్ మార్కెట్ కోసం దీనిని ప్రత్యేకంగా అభివృద్ది చేశారు. ఏదేమైనప్పటికీ, అంతర్జాతీయ విపణిలో మంచి విజయాన్ని అందుకుంటే, దేశీయంగా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Viewed Photos:

మహీంద్రా విపణిలోకి నేడు సరికొత్త మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని విడుదల చేసింది. మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ప్రారంభ ధర రూ. 9.9 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read More About: renault రెనో

Read more...