ఆర్మీలోకి 1,500 టాటా సఫారీలు: నాన్-స్టాప్‌గా ప్రొడక్షన్

టాటా మోటార్స్ తమ ప్రొడక్షన్ ప్లాంటు నుండి 1,500 వ ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసింది. సఫారీ స్టార్మ్ 4x4 వేరియంట్ ఎస్‌యూవీని జిఎస్800 (జనరల్ సర్వీస్ 800) పేరుతో ప్రవేశపెట్టింది.

దేశీయ అగ్రగామి వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రొడక్షన్ ప్లాంటు నుండి 1,500 వ ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీని ఉత్పత్తి చేసింది. సఫారీ స్టార్మ్ 4x4 వేరియంట్ ఎస్‌యూవీని జిఎస్800 (జనరల్ సర్వీస్ 800) పేరుతో ప్రవేశపెట్టింది.

Advertisement

ఇండియన్ ఆర్మీ బలగాల కోసం ఉత్పత్తి చేస్తున్న టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ 1,500 వ వాహనాన్ని రక్షణ మరియు ప్రభుత్వ వాణిజ్య విభాగాధిపతి వెర్నన్ నోరోనా పూనే ప్లాంటులో జెండా ఊపి విడుదల చేశారు.

Advertisement

టాటా జిఎస్800 (జనరల్ సర్వీస్ 800) సఫారీ స్టార్మ్ 4x4 ఎస్‌యూవీని ప్రత్యేకించి ఇండియన్ ఆర్మీ సైన్యం అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసి, డెవలప్ చేశారు. సఫారీ స్టార్మ్ అత్యంత విశ్వసనీయమైన, ధృడమైన డీజల్ ఎస్‌యూవీ మరియు దీని పేలోడ్ గరిష్టంగా 800 కిలోలుగా ఉన్నట్లు టాటా వెల్లడించింది.

టాటా మోటార్స్ ఈ ఆర్మీ ఎడిషన్ సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీకి సుమారుగా 15 నెలల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భూబాగాల్లో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించారు. అన్ని రకాల ఆఫ్ రోడ్ మార్గాల్లో టాటా సఫారీ అత్యద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తుంది.

పూర్తి స్థాయిలో ఇండియన్ ఆర్మీ అవసరాల కోసం రూపొందించిన టాటా జిఎస్800 ఎస్‌యూవీలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రికవరీ హుక్స్, జెర్రీ క్యాన్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

అంతే కాకుండా, ఆర్మీ ఎడిషన్‌లో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం బకెట్ టైప్ సీట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ఎయిర్ కండీషనింగ్ (AC), హీటింగ్ మరియు పవర్ విండోలు ఉన్నాయి. మరియు ఇందులో గరిష్టంగా ఆరు మంది వరకు ప్రయాణించవచ్చు.

ఆర్మీ ఎడిషన్ టాటా సఫారీ స్టార్మ్ జిఎస్800 ఎస్‌యూవీ సాధారణ ఎస్‌యూవీతో పోల్చుకుంటే 70 శాతం అధిక పవర్, 60 శాతం ఎక్కువ పేలోడ్ మరియు 200శాతం అధిక టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా మోటార్స్ సుమారుగా 3,192 ఎస్‌యూవీలను డెలివరీ చేసేందుకు భారత ప్రభుత్వ రక్షణ శాఖ నుండి ఆర్డర్ సొంతం చేసుకుంది. వీటిలో ఇప్పటికే, 1,300 సఫారీ స్టార్మ్ ఎస్‌యూవీలను సైన్యానికి డెలెవరీ చేసింది.

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ ఎస్‌‌యూవీలో సాంకేతికంగా 2.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 148బిహెచ్‌పి-320ఎన్ఎమ్ మరియు 153బిహెచ్‌పి మరియు 400ఎన్ఎమ్ రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభ్యమవుతోంది.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

టాటా సఫారీ స్టార్మ్ ఆర్మీ ఎడిషన్ ఎస్‌యూవీ ఎన్నో ఏళ్లుగా ఇండియన్ ఆర్మీకి సేవలందించిన మారుతి జిప్సీ స్థానాన్ని భర్తీ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరియు అవసరాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో మారుతి జిప్సీలకు వీడ్కోలు పలికి అత్యాధునిక మరియు శక్తివంతమైన వాహనాలను ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టాటా సఫారీ స్టార్మ్ సైన్యంలోకి మార్గం సుగమం చేసుకుంది.

TRENDING

English Summary

Read In Telugu: Tata Motors Rolls-Out 1500th Army-Spec Safari Storme SUV