టాటా నెక్సాన్ క్రేజ్ స్పెషల్ ఎడిషన్ విడుదల

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ విపణిలోకి సరికొత్త టాటా నెక్సాన్ క్రేజ్ (Tata Nexon Kraz) ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. నెక్సాన్ బ్రాండ్ దేశీయ విపణిలోకి పరిచయమయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్‌గా నెక్సాన్ క్రేజ్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

టాటా నెక్సాన్ క్రేజ్ ప్రారంభ ధర రూ. 7.14 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ నెక్సాన్ క్రేజ్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

టాటా నెక్సాన్ క్రేజ్ వేరియంట్లు

సరికొత్త టాటా నెక్సాన్ క్రేజ్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. మరియు ఈ లిమిటెడ్ ఎడిషన్ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి, క్రేజ్ మరియు క్రేజ్+.

టాటా నెక్సాన్ క్రేజ్ ధరలు

టాటా నెక్సాన్ క్రేజ్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.14 లక్షలు మరియు నెక్సాన్ క్రేజ్ డీజల్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.64 లక్షలు‌గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

Variant Petrol Diesel
Nexon KRAZ Rs 7,14,951 Rs 8,07,566
Nexon KRAZ+ Rs 7,76,595 Rs 8,64,058

టాటా నెక్సాన్ క్రేజ్ ఎక్ట్సీరియర్

టాటా నెక్సాన్ క్రేజ్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ పెయింటింగ్ ఇది వరకు లభించే ఇతర నెక్సాన్ మోడళ్లతో పోల్చుకుంటే చాలా కొత్తగా ఉంటుంది. సరికొత్త ట్రోమ్సో బ్లాక్ బాడీ పెయింట్ మరియు సోనిక్-సిల్వర్ డ్యూయల్-టోన్ రూఫ్ కాంబినేషన్‌లో ఎంతో స్టైలిష్‌గా ఉంది. అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ క్యాప్స్, ఫ్రంట్ గ్రిల్‌లోని ఇన్‌సర్ట్స్, వీల్ ఆర్చెస్ మరియు క్రేజ్ ఎడిషన్ బ్యాడ్జింగ్ వంటి డిజైన్ ఎలిమెంట్లు నియో-గ్రీన్ ఫినిషింగ్‌లో ఉన్నాయి.

టాటా నెక్సాన్ క్రేజ్ ఇంటీరియర్

నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో నియో-గ్రీన్ కలర్ ఏసి వెంట్స్ సరౌండింగ్స్ గల పియానో బ్లా డ్యాష్‌బోర్డ్, పియానో బ్లాక్ డోర్ మరియు కన్సోల్ ఫినిషింగ్ అదే విధంగా పియానో బ్లాక్ స్టీరింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి. గ్రీన్ కలర్‌తో క్రేజ్ ప్యాట్రన్‌లో కుట్టబడిన సౌకర్యవంతమైన సీట్లను గమనించవచ్చు.

టాటా నెక్సాన్ క్రేజ్ సాంకేతిక వివరాలు

టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ యానివర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీ రెగ్యులర్ వేరియంట్లలో లభించే 1.2-లీటర్ రివొట్రాన్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ రివొటార్క్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతున్నాయి.

టాటా నెక్సాన్ క్రేజ్ ఫీచర్లు

టాటా నెక్సాన్ ఎక్స్‌టి వేరియంట్ ఆధారంగా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్ ప్రవేశపెట్టారు. అయితే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి ఇందులో మిస్సయ్యాయి. కానీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకోగల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్ మరియు హార్మన్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు వచ్చాయి.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

టాటా నెక్సాన్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నెక్సాన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెక్సాన్ క్రేజ్ ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో ప్రవేశపెట్టారు. డిజైన్ పరంగా చూడటానికి అచ్చం రెగ్యులర్ వేరియంట్‌నే పోలి ఉన్నప్పటికీ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో పలు కాస్మొటిక్ మార్పులు చేసుకున్నాయి. దీంతో స్టాండర్డ్‌ వేరియంట్‌ కంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

Read more...