ఈ సారి ఢిల్లీ ఆటో షో లో మారుతీ సుజుకి దే హవా...!!

ఈ ప్రదర్శనలో సుజుకి కిజాషి మరియు SX4 వంటి సరికొత్త కార్ల ఆవిష్కరణ తో పాటుగా ఇందులో మరిన్ని రాబోవు కార్ల మోడళ్లు ప్రదర్శనకు రానున్నట్టు సమాచారం. ఇందులో సుజుకి కిజాషి డి-సెగ్మెంటుకు చెందిన కారు మోడల్. ఈ కారు 2.4- లీటర్ వివిటి పెట్రోల్ ఇంజన్ తో రూపొందినది.
సుజుకి SX4 హ్యాచ్ బ్యాక్ కారు 2.0 లీటర్ ఇంజన్ తో రూపొంది, ఈ ప్రదర్శన కోసమే ప్రత్యేకంగా భారతదేశానికి దిగుమతి కానుందని సమాచారం. ఈ సుజుకి SX4 కారు 2.0 లీటర్ ఇంజన్ తో పాటుగా 1.6, 1.5 పెట్రోల్ ఇంజన్ల లో కూడా లభ్యం కానుంది. వీటి మధ్య ఇటీవలే విడుదలయిన ఫ్యామిలీ కారు 'ఈకొ' ప్రధాన ఆకర్షణగా నిలువనుంది.


Click it and Unblock the Notifications








