పోటీకి సిద్ధం అవుతున్న టాటా మోటార్స్...!!

By Super

Tata's Xover
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నుండీ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న టాటా-Xover కారును వచ్చే ఏడాది జనవరిలో న్యూ ఢిల్లీ లోజరిగే ఇండియన్ ఆటో ఎక్స్-పో లో ప్రదర్శనకు ఉంచనున్నారు. టయోటా ఇన్నోవా, మహీంద్రా-Xylo మరియు చెవ్రోలెట్ టవేరా లాంటి ఏడు సీట్ల కార్లకు పోటీగా టాటా మోటార్స్ ఈ కారుని విడుదల చేస్తోంది. మూడు వరుసల సీట్లు కలిగి, ఏడు మంది సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలున్న ఈ "ఫ్యామిలీ కారు"లో కొత్త తరం ఇందన్, న్యావిగేషన్ సిస్టం, ABS, ఎయిర్ బ్యాగ్స్ వంటి అధునాతన సౌకర్యాలు అధనపు ఆకర్షణ.

2005లో జరిగిన జెనీవా మోటార్ షోలో తొలి సారి ప్రదర్శనకు వుంచిన ఈ కారు డిజైన్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకొని ప్రస్తుతం ప్రదర్శనకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్రొడక్షన్ గ్రూప్ హెడ్ నితిన్ సేత్ మాట్లాడుతూ జెనీవాలో విడుదల చేసిన మోడల్ కు కొన్ని చిన్న మార్పులు మినహా ఈ కారు మోడల్ లో పెద్ద మార్పులేవీ చోటుచేసుకోలేదని, తప్పక మంచి ఆదరణ పొందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. కాగా ఈ కారు ధర 6 నుండీ 8 లక్షల మధ్య వుండవచ్చని సమాచారం.

More from DriveSpark

Article Published On: Monday, November 23, 2009, 11:11 [IST]
English summary
Tata's Xover to be on show at Auto Expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+