డెట్రాయిట్ ఆటో షోలో అగ్ని ప్రమాదం..!!

By

Auto Show
ఉత్తర అమెరికాలో పేరొందిన డెట్రాయిట్ ఆటో షోలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. గత వారం రోజులుగా సజావుగా నడచిన ఈ ఆటో షోలో నిన్న (జనవరి 21న, గురువారం) చిన్న పాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో షోలో ఆడీ సంస్థ కార్లు ప్రదర్శనకు ఉంచిన స్థలంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవింటలేదు. కానీ ఈ చిన్నపాటి అగ్ని ప్రమాదం వల్ల ఆటో షో ఏర్పాటుచేసిన స్టేజీ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో సందర్శకులు ఏం జరుగుతుందో అని ఖంగారుపడిపోయారు. ఆ తర్వాత నిర్వాహకులు సందర్శకులను బయటకు పంపేసి ఆటో షోను కొన్ని గంటల పాటు ఆపేసి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఆటో షోను పునరుద్దరించారు.

ఈ సందర్భంగా ఆటో షో నిర్వాహకులు ఇది చాలా చిన్న ప్రమాదం అని, ఈ సమస్యను చక్కదిద్దామని సందర్శకులు ఎవ్వరూ భయపడాల్సింది లేదని ప్రకటించారు. షార్ట్ సర్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలిందని వారు ప్రకటించారు. కాగా ఈ ఆటో షో వచ్చే ఆదివారం వరకూ నడవనుంది.

Most Read Articles

Story first published: Friday, January 22, 2010, 10:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X