ఢిల్లీ ఆటో షో ఆరవ రోజు విశేషాలు

2008 వ సంవత్సరంలో భారతీయ మార్కెట్ లోకి విడుదలయిన 15 లక్షల రూపాయలు విలువ చేసే 'ఫియెట్ 500' కారు 'బై డీజిల్ 500' వెర్షన్ ను ప్రదర్శించింది. భారత్ లోకి సూపర్ ప్రీమియం హ్యాచ్ బాక్ 'బై డీజిల్ 500' ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు ఈ ఇటలీ కార్ల సంస్థ ఫియెట్ తెలిపింది.
ఇప్పటి వరకూ కార్లు మొదలుకొని ట్రక్కుల వరకూ అన్ని రకాల వాహనాలనీ రూపొందించిన మహీంద్రా అండ్ మహీంద్రా కైనెటిక్ సంస్థను సొంతం చేసుకుని స్కూటర్లను రూపొందించినట్టే 2010 కల్లా సొంతంగా అభివృద్ధి పరచిన బైకులను మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది.
ఇవి కాక ద్విచక్ర వాహనాలను రూపొందించే సంస్థ లోహియా ఆటో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్టు తెలిపింది. కాగా ఈ ఆటో షో నేటి(జనవరి 11) తో ముగియనుంది.


Click it and Unblock the Notifications








