నిన్న 'నానో'..నేడు 'అరియా'..!!

By Super

Tata Aria
ప్రస్తుతం న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో జరుగుతున్న ఢిల్లీ ఆటో షోలో భారతీయ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త రకం కార్లతో పాటు, కాన్సెప్ట్ కార్లను ప్రదర్శిస్తూ అలరిస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఢిల్లీ ఆటో షోలో టాటా మోటార్స్ బుల్లి కారు 'నానో'తో అందరి దృష్టినీ ఆకర్షించింది. 2009 ఆటో షో మొత్తం నానో గురించిన చర్చలతోనే గడచిపోయింది. లక్షకే కారు అన్నారు, దీని మోడల్ చూస్తే అంతకన్నా ఎక్కువయ్యేలా వుంది, అసలిది సాధ్యమా కాదా అనే నిరవదిక చర్చలతో ఢిల్లీ ఆటో షో కాస్త నానో ఆటో షో మారిపోయింది.

గత ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన టాటా మోటార్స్ ఈ ఏడాది ఆటో షోలో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న టాటా ఇండీక్రూజ్ తో పాటుగా, సరికొత్త మల్టీ పర్పస్ వెహికల్ టాటా అరియాను ప్రదర్శనకు తీసుకువచ్చింది. ఈ మోడల్ తో పాటు టాటా మోటార్స్ టాటా వెన్చర్, టాటా మ్యాజిక్ ఐరిస్ అనే మరో రెండు మోడళ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చింది.

టాటా అరియా ను లగ్జరీ సేదన్ మరియు SUV ఫీచర్స్ ను కలపి రూపొందించినట్టు సమాచారం. ఏడుగురి నుండీ ఎనిమిది మంది వరకూ సౌకర్యవంతంగా కూర్చునే విధంగా రూపొందిన ఈ కారును 2.2 లీటర్ కామన్ రెయిల్ ఇంజన్ తో నడవనుంది. టాటా సఫారీ వాహనాన్ని నడిపే ఇంజన్ తోనే అరియాను కూడా రూపొందించాడు. ఈ కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్ లోకి విడుదల కానుంది. ఈ కారు ధర 7 నుండీ 10 లక్షల మధ్యలో నిర్ణయించనున్నట్టు సమాచారం.

కాగా ఈ ఆటో షోలో టాటా మోటార్స్ నానో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వెర్షన్ ను, టాటా ఇండికా ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చెయ్యనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 6, 2010, 16:49 [IST]
English summary
Tata Aria showcased at Auto Expo 2010
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+