ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ఎమ్ అండ్ ఎమ్ నుండి సరికొత్త కార్లు

ఈ సందర్భంగా కంపెనీ అధ్యక్షుడు డా. పవన్ గోయెంకా మాట్లాడుతూ.. "మెరుగుపడుతున్న సాంకేతిక పరిజ్ఞానికి మహీంద్రా కట్టుబడి ఉందని తెలియజేయడానికి ఢిల్లీ ఆటో ఎక్స్‌పో ఒక మంచి వేదిక, మా ద్విచక్ర వాహనాలను మొదలుకొని భారీ ట్రక్కుల వరకూ క్రియాత్మక ఆటోమోటివ్ పరిష్కారాలను ఇక్కడ ప్రదర్శించనున్నామ"ని చెప్పారు.
భారత వినియోగదారులకు ప్రపంచ-స్థాయి వాహనాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్ అండ్ ఎమ్ 2009లో దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీ అయిన శాంగ్‌యాంగ్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం శాంగ్‌యాంగ్ నుండి లభిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రెక్స్టన్, కొరాండో ఈ ఎస్‌యూవీలను ఢిల్లీ ఆటో ఎక్స్‌పో మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేయనుంది.
'రెక్స్టన్' ఎస్‌యూవీని అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, ప్రత్యేకించి ప్రధానంగా ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్స్ కోసం డిజన్ చేయబడింది. ఇకపోతే సరికొత్త మోనోక్వాక్ ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందిన కాంపాక్ట్ క్రాసోవర్ 'కొరాండో ఈ' ఆధునిక యూరోపియన్ డిజైన్‌తో శాంగ్‌యాంగ్ ఇంజనీరింగ్‌ను మరింత పటిష్టం చేసేదిలా ఉంటుంది.
ప్రస్తుతం ఈ రెండు వాహనాలను శాంగ్‌యాంగ్ భారత రోడ్లపై ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా, మహీంద్రా స్వాధీనం చేసుకున్న, బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రేవాతో కలిసి రూపొందించిన సరికొత్త ఫోర్ సీటర్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు "రేవా ఎన్ఎక్స్ఆర్"ను కూడా ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయనున్నట్లు ఎమ్ అండ్ తెలిపింది.
అంతేకాకుండా, మహీంద్రా అండ్ మహీంద్రా నుండి అత్యంత పాపులర్ అయిన సెడాన్ "వెరిటో"లో కూడా ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. సరికొత్త ఎలక్ట్రిక్ వేరియంట్లో లభ్యం కానున్న వెరిటో సెడాన్‌కు మంచి ఆదరణ లభించగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇవేకాకుండా, ఎక్స్‌యూవీ500, స్కార్పియో, బొలెరో, జీనియో డబుల్ క్యాబిన్, థార్‌లతో పాటుగా, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలను కూడా ఢిల్లీ ఆటో ఎక్స్‌పో కంపెనీ ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications








