ఢిల్లీ ఆటో ఎక్స్‌పోకు పిక్సెల్‌ను తీసుకురానున్న టాటా

కేవలం మూడు మీటర్ల పొడవు మాత్రమే ఉండే ఈ కారులో నలుగురు (డ్రైవర్‌తో కలిపి) ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ప్రత్యేకించి యూరప్ మార్కెట్ల కోసం కంపెనీ ఈ కారును అభివృద్ధి చేసింది. ఇందులో మూడు డోర్లు, నాలుగు సీట్లు ఉంచి డోర్లు కత్తెరలా పైవైపుకు (సిజర్ డోర్స్) తెరచుకునే విధంగా ఉంటాయి.
ఇంకా ఇందులో జీరో టర్న్, ఇన్ఫైనేట్లీ వేరియబుల్ ట్రాన్సిమిషన్ (ఐవిటి) అనే అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాలు, 'మై టాటా కనెక్ట్' అనే స్మార్ట్ ఫోన్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 'మై టాటా కనెక్ట్' అనే ఫీచర్ టాటా మోటార్స్ అందిస్తున్న తొలి హ్యూమన్-మెషీన్ ఇంటర్‌ఫేస్ కాన్సెప్ట్ (హెచ్ఎమ్ఐ). ఇకపోతే ఇందులో 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.
పిక్సెల్‌లో కూడా ఇంజన్ వెనుకవైపే ఉంటుంది. ఇంజన్ ఓవర్‌హీట్‌ను అరిక్టేందుకు అవసరమయ్యే ఆధునిక కూలెంట్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. ఇంధన సామర్థ్యాన్న పెంచే టైర్స్, స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ, ఇంటలిజెంట్ బ్యాటరీ చార్జింగ్ వంటి ఫీచర్లు టాటా నానో పిక్సెల్ సొంతం. ఇది కిలోమీటరుకు 89 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. అయితే, నానో ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న డీజిల్ వేరియంట్ టాటా నానో ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే అవకాశాలు కనబడటం లేదు.


Click it and Unblock the Notifications








