ఆటో ఎక్స్‌పో: రోజుకు లక్ష మంది సందర్శకులకి మాత్రమే అనుమతి

ఇందులో దేశీయ కంపెనీలు 24 కొత్త వాహనాలను, అంతర్జాతీయ కంపెనీలు 8 కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న ద్విచక్ర వాహన కంపెనీలు ఎనిమిది కొత్త ద్విచక్ర వాహనాలు విడుదల చేయనున్నాయని, ఈ ఆటో ఎక్స్‌పో సమయంలో మొత్తం 50 కొత్త గ్లోబల్ వాహనాలను ప్రదర్శనకు ఉంచనున్నామని ఆటో ఎక్స్‌పో 2012 స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ కౌల్ తెలిపారు. అయితే, సందర్శకుల సౌకర్యార్థం ఈసారి ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల సంఖ్యను రోజుకు లక్ష మందికి మాత్రమే పరిమితం చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ లక్ష మందిలో 70,000 మంది సాధారణ ప్రజలు ఉండనున్నారు. ప్రజల సందర్శన పరంగా ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆటో షో. ఈ ఆటో షో జనవరి 5 నుండి జనవరి 11 వరకూ జరుగుతుంది. అయితే, ప్రజలను మాత్రం జనవరి 7 నుండి అనుమతించడం జరుగుతంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ఆటో ఎక్స్‌పో జరుగుతుంది. సుమారు 24 దేశాలకు చెందిన 1,500 ఆటోమొబైల్ కంపెనీలు ఈ షోలో పాల్గొననున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పో ప్రవేశానికి గానూ సాధారణ ప్రజలకు టికెట్ ఖరీదు రూ.150 గాను, వాణిజ్య పర్యాటకులకు రూ.500 గానూ ఉంది.


Click it and Unblock the Notifications








