ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 200సీసీ కెటిఎమ్ డ్యూక్ బైక్ విడుదల

KTM Duke
ఆస్ట్రియన్ స్పోర్ట్ బైక్‌ల తయారీ సంస్థ కెటిఎమ్ మరియు దేశీయ ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటోలు సంయుక్తంగా రూపొందిస్తున్న తొలి మోటార్‌సైకిల్‍‌ 'కెటిఎమ్ డ్యూక్‌'ను ఈ ఏడాది జనవరి నెలలో దేశ రాజధానిలో జరగనున్న "ఆటో ఎక్స్‌పో 2011"లో విడుదల చేయనున్నట్లు కెటిఎమ్ వెల్లడించింది. కెటిఎమ్ కంపెనీలో బజాజ్ ఆటో 40 శాతం వాటాను కలిగి ఉంది. కెటిఎమ్ మరియు బజాజ్ ఆటోలు కలిసి అభివృద్ధి చేసిన తొలి బైక్‌ను ఇప్పటికే ఈ ఏడాది మార్చి నెలలో యూరప్‌ మార్కెట్లో విడుదల చేసింది.

"వచ్చే ఏడాది ఢిల్లీ ఆటో ఎక్స్‌పో జరిగే సమయంలో తొలి 200 సీసీ డ్యూక్ బైక్‌ను భారత్‌లో విడుదల చేస్తామ"ని క్రాస్ ఇండస్ట్రీస్ ఏజి మరియు కెటిఎమ్ స్పోర్ట్‌మోటార్‌సాకిల్స్ ఏజి సంస్థలకు సీఈఓ అయిన స్టెఫన్ పీరెర్ వెల్లడించారు.

బజాజ్ ఆటో కంపెనీలోని పూణే ఉత్పత్తి కేంద్రంలో ఈ బైక్‌ను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో కంపెనీ విక్రయాల లక్ష్యం గురించి పీరెర్ మాట్లాడతూ... "బైక్‌ విడుదల చేసిన మొదటి సంవత్సరంలో 25,000 నుంచి 30,000 యూనిట్లను విక్రయించగలమని అంచనా వేస్తున్నాం. ఒక్క ఏడాది తర్వాత భారత్‌లో 350 సీసీ డ్యూక్‌ను విడుదల చేస్తామ"ని చెప్పారు.

గడచిన మార్చి నెలలో యూరప్‌లో విడుదల చేసిన డ్యూక్ బైక్‌ను ఇప్పటి వరకూ దాదాపు 7,000 యూనిట్లను విక్రయించామని, అక్కడ ఈ ఏడాది 10,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇరు సంస్థలు కూడా ప్రపంచ వ్యాప్తంగా తమ బైక్ మార్కెట్ పరిమాణాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారించాయి.

భారత్‌లో తాము తయారు చేసే అన్ని బైక్‌లు కూడా ప్రపంచ మార్కెట్లకు అనువుగా రూపొందిస్తున్న గ్లోబల్ మోడళ్లని, బజాజ్ ప్లాంటులో తయారయ్యే కెటిఎమ్ బైక్‌లు థాయ్‌లాండ్, మలేషియా, బ్రెజిల్ వంటి ఎదుగుతున్న మార్కెట్లకు ఎగుమతి చేయనున్నామని పీరెర్ చెప్పారు. గతేడాది(2010)లో కెటిఎమ్ 62,000 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది 82,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 14, 2011, 13:11 [IST]
English summary
Austrian sports bike maker KTM and India's second largest two-wheeler maker Bajaj Auto Ltd, jointly developed first motorcycle 200cc Duke would launch in India at the Auto Expo to be held in the Delhi early next year KTM said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+