ఢిల్లీలో హైబ్రిడ్ స్పోర్ట్స్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించిన బిఎమ్‌డబ్ల్యూ

BMW Concept Car
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ రూపొందించిన కొత్త కాన్సెప్ట్ మోడల్ "విజన్ ఎఫిషియంట్ డైనమిక్స్" భారత మార్కెట్లో ప్రదర్శించింది. ఈ కారును కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రి ప్రఫుల్ పటేల్ లాంఛనంగా ఆవిష్కరించారు. నాలుగు సీట్లు కలిగిన ఈ హైబ్రిడ్‌ స్పోర్ట్స్‌ కారు లీటరుకు 26.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సాంప్రదాయ హైబ్రిడ్‌ కార్లతో పోలిస్తే కర్బన ఉద్గారాల విడుదలలో మెరుగైన పనితనం ప్రదర్శిస్తుందని, ఇది కి.మీ. ఒక్కింటికి 99 గ్రాముల CO2ఉద్గారాల వెలువరిస్తుందని సంస్థ ప్రెసిడెంట్‌ ఆండ్రియాస్‌ స్కాఫ్‌ వివరించారు.

ఈ కారు కేవలం 4.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బిఎమ్‌డబ్ల్యూ ఎలా పుణికిపుచ్చుకొంటుందో వివరించేందుకే ఈ కారును ఆవిష్కరిస్తున్నామని, దీనిని రూపొందించడానికి తయారు చేయడానికి ఏడాది సమయం పట్టిందని, ఒకటి రెండేళ్లలో ఈ కారును మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కానీ ఈ కారు ధర ఎంతనే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్థావించలేదు. అయితే దీని కనీసం రూ. 5 కోట్లు ఉంటుందా అని ప్రశ్నించగా, ''అది చాలా తక్కువ'' అని సమాధానమిచ్చారు.

ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. ఇంకా ఇందులో యాక్టివ్ హైబ్రీడ్ టెక్నాలజీ, గ్రౌండ్ బ్రేకింగ్, కటింగ్-ఎడ్జ్ డ్రైవ్ వ్యవస్ధలు కూడా ఉన్నాయి. న్యూఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని కొత్తగా ఏర్పాటు చేసిన బిఎమ్‌డబ్ల్యూ స్టూడియోలో ఈ నెల 24 వరకు ఈ సూపర్ హైబ్రిడ్ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 11, 2011, 10:34 [IST]
English summary
The BMW Vision Efficient Dynamics was first seen in India when it was recently used in the shoot of Mission Impossible 4 (MI4) in Mumbai. The supercar created a lot of buzz in the internet after its sighting. Mumbaikars were definitely impressed by its looks although they could only manage to see the car from a distance during the shoot.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+