మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్: ఎక్స్ఏ ఆల్ఫా

మల్లయోధుల (కుస్తీ ఆటగాళ్లు) పట్టు నుండి స్పూర్తి పొంది డిజైన్ చేసిన ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ మరియు రెడ్ కలర్, డేగ కన్నును ప్రేరణగా తీసుకొని రూపొందించిన సరికొత్త షార్ప్ హెడ్ ల్యాంప్, ఆకర్షనీయమైన ఫ్రంట్ గ్రిల్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ వంటి ఫీచర్లతో రూపొందించిన ఈ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని ఢిల్లీ ఆటో ఎక్స్‌లో గురువారం ఉదయం మారుతి సుజుకి ఆవిష్కరించింది.
అయితే, ఈ మోడల్‌ను ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే విషయాన్ని, దీని ధర మరియు ఇతర సాంకేతిక వివరాలను మాత్రం వెల్లడించేందుకు కంపెనీ నిరాకరించింది. కాగా.. ఎంతకాలం నుండో వేచి చూస్తున్న ఎర్టిగా ఎమ్‌పివిని శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేయనున్నామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








