బీజింగ్‌లో ఫియట్-క్రిస్లర్ తొలి కారు 'వియాజియో' ఆవిష్కరణ
ఫియట్, క్రిస్లర్ కంపెనీలు సంయుక్తంగా రూపొందించిన మొట్టమొదటి కారు "వియాజియో" వచ్చే యావత్ ప్రపంచ వీక్షించనుంది. ఏప్రిల్ 23వ తేది నుండి ప్రారంభం కానున్న బీజింగ్ అంతర్జాతీయ ఆటో షోలో ఫియట్ తమ వియాజియో కారును ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన కొన్ని టీజర్లతో ఆటో ప్రియుల దృష్టిని ఆకట్టుకుంటోంది.
వియాజియో వరల్డ్ ప్రివ్యూను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఫియట్ పేర్కొంది. విశిష్టమైన పవర్, మెరుగైన మైలేజ్, అధునాత టెక్నాలజీ, అందమైన లుక్, ఆకర్షనీయమైన ఇటాలియన్ డిజైన్ వంటి ప్రత్యేకతలో ఈ కారును రూపొందించామని ఫియట్ తెలిపింది. ఈ కారును ఫియట్-క్రిస్లర్ జాయింట్ వెంచర్ చైనా (మేడ్ ఇన్ చైనా)లో తయారు చేసింది.

ఫియట్ వియాజియో 4,679 మి.మీ. పొడవును, 1,850 మి.మీ. వెడల్పును, 2,708 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. వియాజియోలో 1.4 లీటర్ టిజెట్ టర్బో-ఛార్జ్‌డ్ ఇంజన్లను ఉపయోగించారు. ఇందులో ఓ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని, మరొక ఇంజన్ 150 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కానీ లేదా ఫియట్ పవర్‌ట్రైన్స్ తాజాగా అభివృద్ధి చేసిన డ్యూయల్ డ్రై క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిడిసిటి)తో కానీ లభించే అవకాశం ఉంది.
వియాజియోను ప్రస్తుత సంవత్సరం మూడవ త్రైమాసికంలో తొలుత చైనాలో, ఆపై ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయాలని ఫియట్ యోచిస్తోంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఇండియన్ మార్కెట్‌కు కూడా ఈ వియాజియో సెడాన్ వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.


Click it and Unblock the Notifications








