సరికొత్త మోడళ్ల విడుదలతో మెరిసిన బీజింగ్ ఆటో షో

ఆటోమొబైల్ రంగంలో సరికొత్త కార్ల విడుదలకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శనకు చైనాలో జరుగుతున్న 2012 బీజింగ్ ఆటో షో వేదికగా మారనుంది. ఈ షోలో సుమారు 1000కి పైగా కార్లు, అందులో 100కు పైగా సరికొత్త ఆవిష్కరణలు చోటు చేసుకోనున్నాయి. ఈసారి ఈ ఆటో షోకు సుమారు 10 లక్షల మంది సందర్శకులు రావచ్చని అంచనా.

బీజింగ్ ఆటో షో 2012లో తొలిరోజున వివిధ కంపెనీలు ఆవిష్కరించిన ఉత్పత్తుల వివరాలు ఈవిదంగా ఉన్నాయి:

* అమెరికన్ కార్ మేకర్ క్రిస్లర్ రూపొందించిన డ్రాగన్ థీమ్డ్ జీప్ వేరియంట్‌ను ఆవిష్కరించింది.

* అలాగే, ఫోర్డ్ మోటార్స్ గడచిన జనరిలో జరిగిన 2012 ఆటో ఎక్స్‌లో తొలిసారిగా ఆవిష్కరించిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌కు ప్రొడక్షన్ వెర్షన్‌ను (ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్) విడుదల చేసింది.

* ఇటాలియన్ కార్ ఫియట్, అమెరికన్ కార్ కంపెనీ క్రిస్లర్‌లు జంటగా చైనాలో రూపొందించిన మేడ్ ఇన్ చైనా గ్లోబల్ సెడాన్ "ఫియట్ వియాజియో"ను ఆవిష్కరించాయి.

* ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు పెట్టే స్పోర్ట్స్ కార్లను తయారు చేసే కంపెనీ లాంబోర్గినీ తొలిసారిగా రూపొందించిన ఎస్‌యూవీ "లాంబోర్గినీ యూరస్"ను ఆవిష్కరించింది.

* రాయల్ కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ అందిస్తున్న ఫాంటమ్ బ్రాండ్‌లో ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్‌ వెర్షన్ ఫాంట్ సిరీస్ 2 కారును ఆవిష్కరించింది.

ఇవే కాకుండా మిత్సుబిషి, సుజుకి, జనరల్‌ మోటార్స్‌, ఆడి, వోల్వో, టాటా మోటార్స్‌, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌, ఫోక్స్‌వాగన్‌, స్కోడా, మెర్సిడెస్‌ బెంజ్‌ వంటి కంపెనీలు ఇప్పటికే తమ స్టాల్స్‌ ఏర్పాట్లను పూర్తి చేసి వివిధ కార్లను ప్రదర్శనకు ఉంచాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 23, 2012, 19:49 [IST]
English summary
The Beijing Auto Show which opened today saw a long list of new cars being involved. There is little doubt among carmakers about China being their most crucial market for the next decade and they have shown that by the number of special cars that appear to have been built considering the Chinese car buyer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+