బిఎమ్‌డబ్ల్యూ తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు 'ఐ8 స్పైడర్'
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గడచిన సంవత్సరం ఐ (i) బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల సెగ్మెంట్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఐ3, ఐ8 అనే రెండు కాన్సెప్ట్ కార్లను బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించింది. ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌కు సిద్ధంగా ఉన్న ఐ8 స్పైడర్ స్పోర్ట్స్ కూపేను ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న 120 ఆటో షోలో బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించింది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆకర్షనీయమైన లుక్, సరికొత్త స్టయిల్‌తో డిజైన్ చేసిన ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారులో 1.5 లీటర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు, ఇది డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్ ద్వారా రియర్ యాక్సిల్ (వెనుక చక్రాలకు) పవర్‌ను అందిస్తుంది. అలాగే, ఇందులో అమర్చిన 125 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్ ఫ్రంట్ యాక్సిల్ (ముందు చక్రాలకు పవర్‌ను చేరవేస్తుంది.
ఐ8 స్పైడర్ కారును పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా ఎలక్ట్రిక్ పవర్‌తో కానీ లేదా రెండింటిన ఒకేసారి కానీ ఉపయోగించి డ్రైవ్ చేయవచ్చు. ఈ రెండూ కలిపి మొత్తం 349 హెచ్‌పిల శక్తిని, 550 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. బిఎమ్‌డబ్ల్యూ భవిష్యత్తులో తయారు చేయనున్న అన్ని ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్ల యొక్క డ్రైవ్ టెక్నాలజీ కోసం "ఈ-డ్రైవ్" (eDrive)ను ట్రేడ్‌మార్క్ చేయించామని బిఎమ్‌డబ్ల్యూ ప్రకటించింది.
బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ధి చేసిన ఐ3, ఐ8 అనే ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కార్లను భారత మార్కెట్‌లో కూడా విడుదల చేయనున్నట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. 2013-14 నాటికి ఈ బిఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ కార్లు భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.
బిఎమ్‌డబ్ల్యూ డవలప్ చేసిన ఐ3 కాన్సెప్ట్ కారులో నలుగురు ప్రయాణికులు కూర్చుని ప్రయాణించవచ్చు. ఇది ప్రత్యేకించి నగర ప్రాంత ప్రజలను మరియు రోడ్లను దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. ఇది కేవలం 8 సెండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
అలాగే, ఐ8 కాన్సెప్ట్ డైనమిక్ డ్రైవింగ్, స్టయిలిష్ లుక్, స్పోర్టీ ఫీల్ కోరుకునే యువతను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినది. ఇది ఓ స్పోర్ట్ కార్ లుక్‌ను మరియు డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది. ప్రారంభ దశలో భాగంగా ఈ మోడళ్లను ఎంపిక చేసిన ప్రధాన నగరాలలో మాత్రమే బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేయనుంది.
Check out the BMW i8 Spyder Concept photo gallery


Click it and Unblock the Notifications









