క్యూ5లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఆవిష్కరించిన ఆడి
జర్మనీకు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ అందిస్తున్న క్యూ5 ఎస్‌యూవీలో ఓ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా.. ఆడి అభివృద్ధి చేసిన 2013 క్యూ5 ఎస్‌యూవీ ఫోటోలను, వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. ఈ ఏడాది జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేయనుంది. డిజైన్ పరంగా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యూ5 ఎస్‌యూవీతో పోలిస్తే, కొత్త 2013 క్యూ5 ఎస్‌యూవీలో డిజైన్ పరంగా కొద్దిపాటి చిన్న మార్పులు చేయబడ్డాయి.
అలాగే, ఇంజన్ పరంగా కూడా 2013 వెర్షన్ క్యూ5 ఎస్‌యూవీలో మెరుగైన, అధిక మైలేజ్‌నిచ్చే ఇంజన్లను ఉపయోగింరు. ఎంట్రీ లెవల్ వేరియంట్‌లో అమర్చిన 2.0 టిడిఐ ఇంజన్ పాత వేరియంట్ కన్నా 4 బిహెచ్‌పిల అదనపు శక్తిని విడుదల చేస్తుంది. 3.0 లీటర్ వీ6 టిడిఐ ఇంజన్ కేవలం పవర్‌ను 1 బిహెచ్‌పి పెంచినప్పటికీ, టార్క్‌ను మాత్రం 8 కెజిఎమ్‌లకు పెంచడం జరిగింది.

ఇందులో చెప్పుకోదగిన పెద్ద మార్పు ఏంటంటే, 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ ఇంజన్‌లో వాల్వ్ కంట్రోల్స్, స్ట్రోక్‌లో మార్పులు, మెరుగపరచబడిన థెర్మల్ మేనేజ్‌మెంట్, రివైజ్ చేయబడిన ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్, టర్బో ఛార్జర్, సిలిండర్ హెడ్‌లో ఎగ్జాస్ట్ మానిఫోల్డ్‌నుఇంటిగ్రేట్ చేయడం, పవర్‌ను 10 బిహెచ్‌పిలు (221 బిహెచ్‌పి) పెంచడం వంటి మార్పులు చేయబడ్డాయి.
కొత్త 2013 ఆడి క్యూ5 ఎస్‌యూవీలో బంపర్స్, గ్రిల్, హెడ్‌ల్యాంప్, గ్రాఫిక్స్, టైల్‌పైప్స్‌లలో మార్పులు చేయబడ్డాయి. ఇంటీరియర్లలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవు. ఈ ఏడాది చివరి నాటికి సరికొత్త ఆడి క్యూ5 ఎస్‌యూవీని ఆడి ఇండియా దేశీయ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న 2012 ఆటో షోలో కూడా ఆడి తమ కొత్త 2013 వెర్షన్ క్యూ5 కారును ప్రదర్శనకు ఉంచింది.


Click it and Unblock the Notifications








