సిగ్గు.. సిగ్గు..: ఆటో ఎక్స్‌పోలో అన్నీ అవకతవకలే!

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పో నిర్వహణపై ఇటు ఎగ్జిబిటర్ల నుండి అటు మీడియా నుండి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గడచిన 2010 సంవత్సరంలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వివిధ చర్యలు తీసుకున్నప్పటికీ అవి పెద్దగా ఫలితాలను ఇవ్వలేక పోయాయి.

ఆటో ఎక్స్‌పో జరుగుతున్న ప్రగతి మైదాన్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగా ఎగ్జిబిటర్లు, కార్పోరేట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనికితోడు సందర్శకుల తాకిడి కూడా అధికంగా ఉండటం నిర్వాహకులకు మరొక తలనొప్పిగా మారింది. విదేశీయ మీడియా ప్రతినిధులు సైతం తమ బ్యాడ్జ్‌ల కోసం రోజంతా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

గతంలో నిర్వహణా కార్యకలాపాలను స్వయంగా నిర్వహించిన సిఐఐ, ప్రస్తుతం ప్రదర్శనను వేరొక పిఆర్ సంస్థకు అప్పజెప్పింది. అయితే, సదరు పిఆర్ సంస్థ ఆశించిన రీతిలో పనితీరును కనబరచకపోవడంతో చివరకు అసంతృప్తే మిగిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ప్రదర్శన అయిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో పట్ల నిర్వాహకుల వైఖరి నిరాశను మిగిల్చింది.

దీంతో రానున్న 2014లో జరగబోయే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను నగర శివార్లలోని నోయిడాలో ఏర్పాటు చేయాలని కమిటీ యోచిస్తోంది. ఇటీవలే భారత్‌లో తొలి గ్రాండ్ ప్రి జరిగిన బుధ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో 2014 ఆటో ఎక్స్‌పో నిర్వహించనున్నామని నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ రాజీవ్‌ కౌల్‌ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Monday, January 9, 2012, 17:06 [IST]
English summary
With many exhibitors at 11th Auto Expo complaining about poor crowd management, the owner of the venue, ITPO, today put all the blame on industry body CII, saying it was not responsible for issuing free passes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+