జెనీవా ఆటో షోలో బి-మ్యాక్స్ ఎమ్‌పివి విడుదల చేసిన ఫోర్డ్
నాలుగు మీటర్ల కన్నా కొంచెం పొడవుండే (4.04 మీటర్లు) బి-మ్యాక్స్‌లో వెనుక వైపు స్లైడ్ డోర్‌ను (మారుతి ఓమ్నీ లాంటి డోర్) ముందువైపు సాధారణ డోర్‌ను కలిగి ఉంటుంది. బి-మ్యాక్స్ మ్‌పివిలో బి-పిల్లర్ కనిపించదు, దీనిని డోర్లలోనే ఫిక్స్ చేయబడి ఉండటం ఇందలోని ప్రధాన ప్రత్యేకత. ఇందులో ఫ్రంట్ ప్యాసింజర్, రియర్ బెంచ్ సీట్లను పూర్తి మడచివేసి కార్గో వ్యాన్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు.
ఫోర్డ్ బి-మ్యాక్స్ ఎమ్‌పివి రెండు ఇంజన్ ఆప్షన్లతో లభించనుంది. అందులో ఒకటి 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్‌డ్ ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ (త్వరలో మార్కెట్లోకి రానున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు), మరొకటి ప్రస్తుతం ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్‌లలో ఉపయోగిస్తున్న 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన డ్యూరాటెక్ డీజిల్ ఇంజన్.


Click it and Unblock the Notifications









