ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కృతం కానున్న జాగ్వార్ ఎఫ్-టైప్

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ వచ్చే నెల 27 నుంచి జరిగే ప్యారిస్ మోటార్ షోలో రెండు సీట్లతో రూపొందించిన సరికొత్త ఎఫ్-టైప్ స్పోర్ట్స్‌కారును ప్రదర్శించనున్నామని పేర్కొంది. మడూ విభిన్న ఇంజన్ సామర్థ్యాలు కలిగిన ఈ సూపర్ స్పోర్ట్స్ కారును వచ్చే ఏడాది జూన్ కల్లా మార్కెట్లోకి తెస్తామని కంపెనీ తెలిపింది.

గతేడాది సెప్టెంబర్‌ నెలలో సి-ఎక్స్‌ 16 కాన్సెప్ట్‌తో వీటిని తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకువచ్చామని, ఈ సంవత్సరం చివరి త్రైమాసికం నుండి ఎఫ్‌-టైప్‌ కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. ఇంగ్లాండ్‌లోని కాజిల్ బ్రాంవిక్ ప్లాంట్‌లో ఈ కారును జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉత్పత్తి చేయనుంది. ఈ కారు విడుదలతో కంపెనీ తిరిగి స్పోర్ట్స్ కారు సెగ్మెంట్‌లోకి ప్రవేశించనుంది.

రానున్న నాలుగైదేళ్లలో సుమారు 40 కొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నామని జేఎల్‌ఆర్ గతంలో ప్రకటించింది. జాగ్వార్ విడుదల చేయనున్న సరికొత్త ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారులో 8-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఎనిమిది గేర్లు), ఆటో స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలుంటాయని, తమ బ్రాండ్ నుంచి ఓ స్పోర్ట్స్ కారు వస్తోందంటే, మార్కెట్లో భారీ అంచనాలు ఉంటాయని, ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ కారును రూపొందిస్తున్నామని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Saturday, August 11, 2012, 17:29 [IST]
English summary
Jaguar, the British premium carmaker has announced its re-entry to the sports car by launching a two seater convertible sports car called as the F-Type. The Jaguar F-Type roadster revealed on September 27 at the Paris Motor Show.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+