ప్యారిస్ మోటార్ షోలో మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్

కళ్లు మిరుమిట్లుగొలిపే ఈ మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ కారును చూడండి. జర్మన్ లగ్జీరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా అందిస్తున్న స్పోర్ట్స్ కారు ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జిలో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ మెర్సిడెస్ బెంజ్ తయారు చేసిన ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జిలలో కెల్లా ఇదే అత్యం వేగంతో పరుగులు తీస్తుంది. ఈ కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్' కారును ప్రస్తుతం ప్యారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది.

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - ప్యారిస్

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - ప్యారిస్

ప్యారిస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోరో మెర్సిడెస్ బెంజ్ ఓ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేసింది.

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ కారు

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ కారు

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ కారులో నాలుగు చక్రాల్లో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ నాలుగు మోటార్లు కూడా ఇందులో అమర్చిన 60 కి.వా. లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా పనిచేస్తాయి. ఇవి స్వతంత్రంగా కంట్రోల్ చేయబడుతాయి.

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - పవర్

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - పవర్

పెర్ఫామెన్స్:

గరిష్ట పవర్ - 552 కి.వా. (740 బిహెచ్‌పి)

గరిష్ట టార్క్ - 1000 ఎన్ఎమ్

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - యాక్సిలరేషన్

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - యాక్సిలరేషన్

యాక్సిలరేషన్:

3.9 సెకండ్లలో 0 నుంచి 100 కి.మీ. వేగం

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - రేంజ్

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - రేంజ్

రేంజ్:

సింగిల్ ఛార్జ్‌పై 250 కిలోమీటర్లు (ఎన్ఈడిసి కంబైన్డ్ ప్రకారం)

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - బ్యాటరీ

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - బ్యాటరీ

బ్యాటరీ:

బ్యాటరీ టైప్ - 60 కి.వా. లిథియం అయాన్ బ్యాటరీ

బ్యాటరీ వోల్టేజ్ - 400 వోల్ట్స్

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - ధర

ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ - ధర

ధర:

సుమారు రూ.6 కోట్లకు పైమాటే


దీనితో పాటుగా బి-క్లాస్ ఎలక్ట్రిక్ డ్రైవ్, సిఎల్ఎస్ షూటింగ్ బ్రేక్ ఎలక్ట్రిక్ వెర్షన్లను మెర్సిడెస్ బెంజ్ ప్రదర్శనకు ఉంచింది. ఈ సరికొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో కెల్లా అత్యంత ఖరీదైనది. 2009 ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి స్పోర్ట్స్ కారులోని అనేక ఫీచర్లను ఈ కొత్త ఎలక్టిక్ కారులో గమనించవచ్చు. ఈ కారులో నాలుగు చక్రాలకు నాలుగు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ నాలుగు మోటార్లు కలిసి గరిష్టంగా 740 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ మోటార్లన్నీ కూడా కారులో అమర్చిన 60 కి.వా. లిథియన్ అయాన్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. ఇది కేవలం 3.9 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి కూపే ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. జర్మనీలో ఈ ఎలక్ట్రిక్ కారు ధర 4,16,500 యూరోలు (మన కరెన్సీలో సుమారు 2.82 కోట్లు). అదే పెట్రోల్ వెర్షన్ ధర అయితే కేవలం ధర 2,04,680 యూరోలు (మన కరెన్సీలో సుమారు 1.38 కోట్లు) మాత్రమే. దిగుమతి సుంఖాలు కలుపుకుంటే, మన దేశంలో ఈ ఎసక్ట్రిక్ కారు ధర సుమారు రూ.6 కోట్ల వరకూ ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, October 1, 2012, 16:59 [IST]
English summary
Mercedes-Benz has unveiled the SLS AMG Coupe Electric Drive concept at the Paris Motor Show. Powered by four electric motors that are connected to the gull wing car's four wheels, the SLS AMG can accelerate to 100kmph in less than four seconds. The electric motors are able to generate 740bhp and 1000Nm of torque. The SLS AMG Electric Drive can reach a top speed of 250kmph.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+